పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇంకా జరగాల్సిన విషయాలు ఏమిటో తెలుసా?

Ads

కలికాలం అంతం ఎలా అవుతుందో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లో పేర్కొన్నారు.అయితే ఇంకా కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి చాలానే ఉన్నాయి. ఇంతక ముందు చాలా సందర్భాలలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన విషయాలు జరిగాయి. వాటి గురించి మనం అక్కడా…ఇక్కడా ప్రస్తావన వచ్చింది కూడా. ఎన్టీఆర్ నటించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సినిమా పుణ్యమా అని అందరికీ కాలజ్ఞానం లో ఏమి వుంది అన్నది బాగా తెలుసు.

అయితే కాలజ్ఞానం ప్రకారం ఇంకా జరగాల్సినవి ఏంటి అనే విషయం తెలుసుకుందామా…బ్రహ్మం గారి ప్రకారం తిరుపతి కి వెళ్లే అని మార్గాలు మూసుకు పోతాయట. కృష్ణా నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది,కానీ అది చూసిన వాళ్ళ కంటి చూపును కోల్పోతారట. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారట. అలాగే శ్రీశైలం మల్లికార్జునుడు నేరుగా భక్తులతో మాట్లాడుతారట.

Ads

యాగంటి బసవన్న ఎలుగెత్తి రంకె వేస్తాడు. బనగానపల్లెలో పాతరం పైన ఉన్న చింత చెట్టు కు బూజులు పూస్తాయి.రాయదుర్గంలో ఒక రామ చిలుక వీర ధర్మాలు చెబుతుంది.శ్రీకాళహస్తి గుడిని దోపిడీ దొంగలు దోచుకుంటారు. నెల్లూరు పటణం నీట మునుగుతుంది.


పగులు జరగవలసిన సూర్యోదయం అర్ధ రాత్రి జరుగుతుంది. ఇవే కాక ఇంకా చాలా జరగవలసిన విషయాలు ఉన్నాయి.మరి ఇవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ అప్పుడపుడు అదిగో కలియుగాంతం వచ్చేస్తుంది అని కొందరు హడావిడి మాత్రం చేస్తుంటారు.

Previous articleపదమూడేళ్లకే పెళ్లి, విడాకులు అయిన అమ్మాయి ఈ రోజు ఏ స్థాయిలో ఉందో తెలుసా?
Next articleఈ 10 మంది హీరో-హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన హీరో-హీరోయిన్లు ఎవరో తెలుసా.?