Ads
ఆరు పదుల వయసు దాటుతున్నా…. తాతలు ,తండ్రులు అవుతున్నా, తమ వారసులు కూడా సినీ రంగ ప్రవేశం చేసినా…కొందరు స్టార్ హీరోలు ఇప్పటికీ హీరోలు గానే కంటిన్యూ అవుతున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం ఈ లెక్కలు మారుతూ ఉంటాయి. కెరీర్ తొలి దశలో హీరోయిన్ గా…కాస్త టైం అయ్యాక వదిన ,చెల్లి ,అక్క ఇలా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా…ఇక తర్వాత ఫైనల్ గా అత్త తల్లి క్యారెక్టర్ లో నటిస్తూ ఉంటారు.
టాలీవుడ్ అనే కాదు ప్రతి సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఇంతే. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయలేక ఇక తమ కెరియర్ కు అక్కడితో పులిస్టాప్ పెట్టేస్తారు. కొందరైతే తాము కెరియర్ తొలి దశలో ఏ హీరోతో హీరోయిన్ గా నటించారో …తరువాత అదే హీరోకి చెల్లిగా ,ఆఖరికి తల్లిగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విధంగా ఒకప్పుడు చిరంజీవితో స్టెప్పులేసిన హీరోయిన్ తరువాత క్రమంగా అతనికి చెల్లి ,తర్వాత అమ్మ గా నటించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే…సీనియర్ నటి సుజాత.
Ads
తెలుగు ,హిందీ ,తమిళం, కన్నడం ,మలయాళం ఇలా పలు భాషలలో స్టార్ హీరోలతో సుమారు 300కు పైగా చిత్రాలు నటించిన సీనియర్ నటి సుజాత. 1980లో కృష్ణంరాజు ,చిరంజీవి కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ప్రేమ తరంగాలలో చిరంజీవికి జోడిగా సుజాత నటించింది. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన సీతాదేవి అనే మూవీలో చిరంజీవికి చెల్లిగా యాక్ట్ చేసింది. చిరుకు అక్కగా 1984లో అగ్నిగుండం సినిమాలో నటించారు సుజాత.
ఇక ఆ తరువాత 1995లో వచ్చిన చిరంజీవి సూపర్ డూపర్ హిట్ చిత్రం బిగ్ బాస్ మూవీలో అతనికి తల్లిగా నటించింది. మంచి నటిగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సుజాత, 2011 ఏప్రిల్ ఆరవ తారీకు అనారోగ్య కారణంగా కన్నుమూశారు.