సీక్వెల్ అనే తీశారు…మరి చంద్రముఖి 2 లో ఈ లాజిక్ ఎలా మరిచిపోయారు.?

Ads

ఒక పెద్ద పాడుబడిన కోట.. ఆ కోటలో కొన్ని సంవత్సరాలుగా దాగి ఉన్న ఒక రహస్యం…సడన్ గా అందులో నుంచి బయటకు వచ్చిన ఒక ఆత్మ.. ఇక ఆత్మకు విముక్తి కలిగించే ప్రయత్నంలో హీరో మరియు కుటుంబ సభ్యులు. ఈ కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి ,వస్తూనే ఉన్నాయి. కానీ 2005లో విడుదలైన రజనీకాంత్ చంద్రముఖి చిత్రం మాత్రం వీటన్నిటికీ ఎక్సెప్షన్. ఇప్పటికి కూడా వారాయి సాంగ్ అర్ధరాత్రి వింటే ఎంతటి వాళ్ళకైనా వణుకు పుట్టాల్సిందే. అటువంటి ఇంపాక్ట్ ఉన్న ఆ చిత్రం అప్పటిలో సౌత్ లోనే అత్యధిక కలెక్షన్స్ను నమోదు చేసిన మూవీ.

ఈ మూవీ హారర్ కాన్సెప్ట్ తో పాటు మంచి థ్రిల్లింగ్ అలాగే కామెడీ సమ్మేళనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ తరువాత దీనికి సీక్వెల్ గా 17 సంవత్సరాల తరువాత చంద్రముఖి 2 రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించింది. నిన్న సెప్టెంబర్ 28వ తారీకున విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతానికి బాగానే సాగుతోంది. అయితే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం చంద్రముఖి 2 లో ఒరిజినల్ చంద్రముఖి గా కంగనా కనిపిస్తుంది అని చెప్పారు.

Ads

చంద్రముఖి సినిమాలో జ్యోతిక తరలి చంద్రముఖి ఆవహించింది అని మాత్రమే చూపించారు కానీ ఆమె ఒరిజినల్ చంద్రముఖి కాదట. ఇక పార్ట్ టూ లో ఒరిజినల్ చంద్రముఖి కంగనానే అని ఈ మూవీ డైరెక్టర్ వాసు తెలియజేశారు. అయితే ఇదే డైరెక్టర్ తెరకెక్కించిన నాగవల్లి చిత్రం పరిస్థితి ఏమిటి. వెంకటేష్ మెయిన్ క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంలో అనుష్కను చంద్రముఖి క్యారెక్టర్లు చూపించారు…ఆ తర్వాత పగ సాధించడం కోసం చంద్రముఖి రిచా గంగోపాధ్యాయ్ ఆవహించినట్లు చూపించారు.

అప్పట్లో చంద్రముఖికి సీక్వెల్ నాగవల్లి అన్న ప్రచారం కూడా జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఒరిజినల్ చంద్రముఖి అనుష్క అవుతుంది…అయితే ఇప్పుడు కంగనా ఒరిజినల్ చంద్రముఖి ఎలా అవుతుంది? అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో మిలియన్ డాలర్ క్యూస్షన్ గా తిరుగుతోంది. అయితే దీనికి వాసు అండ్ టీం ‘నాగవల్లి’చిత్రం కేవలం కన్నడలో వచ్చినటువంటి ‘ఆప్త రక్షక’ అనే మూవీ కి రీమేక్ అని విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.

Previous articlePEDDHA KAPU 1 REVIEW: శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో కొత్త హీరోతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా..?
Next articleచిరంజీవికి లవర్ గా, చెల్లిగా, అక్కగా…చివరికి తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.