శ్రీదేవి నుండి శ్రీ లీల వరకు.. తమకంటే ఎక్కువ వయసున్న హీరోలతో నటించిన హీరోయిన్స్..

Ads

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే వారికి టాలెంట్, అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావాలి. అయితే కొందరు హీరోయిన్లు తొలి సినిమాతోనే ఆడియెన్స్, ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుని వరుసగా అవకాశాలు పొందుతూ ఉంటారు.

Ads

హీరోలు దశాబ్దాల పాటు స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. వాళ్ళ కెరీర్ మహా అయితే పదేళ్ళు ఉంటుంది. వాళ్ళు కెరీర్లో స్టార్ హీరోల పక్కన నటించినప్పుడే వాళ్ళకు క్రేజ్ ఉంటుంది. దాంతో వాళ్ళ కన్నా ఎక్కువ వయసు ఉన్న హీరోలతో కూడా రొమాన్స్ చేయాల్సి వస్తుంది. అలా ఎక్కువ వయసు హీరోలతో నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
శ్రీదేవి:
బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి సీనియర్ ఎన్టీరామరావుకి మనవరాలిగా బడి పంతులు సినిమాలో నటించింది. ఆ తరువాత హీరోయిన్ గా చాలా సినిమాలలో ఎన్టీరామరావుకి జంటగా నటించింది.
లావణ్య త్రిపాఠి:
ఈ యంగ్ హీరోయిన్ తనకన్నా చాలా ఎక్కువ వయసున్న అక్కినేని నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నటించింది.
రితీకా సింగ్:
గురు సినిమాలో తన కన్నా ఎక్కువ వయసున్న హీరో వెంకటేష్ కు హీరోయిన్ గా నటించింది.
శృతి హాసన్:
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా,  ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా మారింది. శృతి హాసన్ తనకన్నా ఎక్కువ వయసున్న హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణలకు హీరోయిన్ గా నటించింది. వీరసింహ రెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించింది. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి.
శ్రీ లీల:
శ్రీ లీల పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అందంతో పాటు నటన, డాన్స్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. 21 ఏళ్ల వయసున్నఈ హీరోయిన్ తనకన్నా 32 ఏళ్ల వయస్సు ఎక్కువగా ఉన్న రవితేజతో ధమాకా సినిమలో నటించింది.
Also Read: శ్రీలీల లాగే తమ డ్యాన్స్ తో భారతీయ సినీ పరిశ్రమను ఊపేసిన 10 మంది హీరోయిన్లు వీరే..

Previous articleసూపర్ స్టార్ రజినీకాంత్ వదులుకున్న తెలుగు సినిమా ఏమిటో తెలుసా?
Next articleఇదేందయ్యా ఇది.. ఇంత మెరుపు వేగం ఎప్పుడూ చూడలేదు…వైరల్ అయిన సామజవరగమన సీన్….
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.