ఇదేందయ్యా ఇది.. ఇంత మెరుపు వేగం ఎప్పుడూ చూడలేదు…వైరల్ అయిన సామజవరగమన సీన్….

Ads

లిమిటెడ్ బడ్జెట్ తో విడుదలయ్య చిన్న చిత్రాలు ఒక్కొక్కసారి కంటెంట్ కనెక్ట్ అయితే ఊహించని సక్సెస్ అందుకుంటాయి. అదే తరహాలో చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రికార్డ్ సృష్టించిన చిత్రం సామజవరగమన. బ్రోచేవారెవరురా తర్వాత శ్రీ విష్ణు కి మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా ఇది.   

ఒకరకంగా సినిమా మొత్తం శ్రీ విష్ణు మరియు నరేష్ పై ఆధారపడి ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం కావడంతో పెట్టిన పెట్టుబడి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ప్రాఫిట్ వచ్చినట్లు ఇక ఈ మూవీలో నరేష్ చేసే కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది.కామెడీ మెయిన్ యాంగిల్ లో సాగే ఈ చిత్రంలో ఒక సీన్ ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతుంది.

నరేష్ నటించిన కామెడీ సీన్స్ ని వైరల్ చేస్తున్న పబ్లిక్ అనుకోకుండా ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇప్పుడు అది నెట్లో బాగా వైరల్ అవుతుంది. మూవీలో నిశ్చితార్థం ఆపడానికి నరేష్ ప్రయత్నించే సీన్లు శ్రీకాంత్ అయ్యంగారి క్యారెక్టర్ కి మరియు నరేష్ క్యారెక్టర్ కి మధ్య కాస్త వాగ్వాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎటు చూసినా ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కెమెరా యాంగిల్ కి కనపడతారు.

కాసేపు శ్రీకాంత్ అయ్యంగారి వెనుక ,కాసేపు నరేష్ వెనక ఒకే డ్రెస్సులు వేసుకున్న ఈ జూనియర్ ఆర్టిస్టులు మెరుపుతీగ కంటే వేగంగా అటు ఇటు ఎలా మారారు ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించి ఉన్న ఆ సీన్ ని నటిజన్స్ విపరీతంగా షేర్ చేయడమే కాక కెమెరా లెన్స్ కన్నా వేగంగా వెళ్లారే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జనరల్ గా చిన్న సినిమాల్లో ఇటువంటి చిన్న తప్పులు సహజమే. పెద్ద స్క్రీన్ పై చూసినప్పుడు మనము అంతగా పట్టించుకోము కానీ ఓటీటీ లో వచ్చినప్పుడు తిప్పించి మళ్ళి చూసే క్రమంలో ఇలాంటివి సులభంగా దొరుకుతాయి. అలా దొరికిన ఈ సీనే ప్రస్తుతం నెట్ లో వైరల్ అయింది.

Ads

Previous articleశ్రీదేవి నుండి శ్రీ లీల వరకు.. తమకంటే ఎక్కువ వయసున్న హీరోలతో నటించిన హీరోయిన్స్..
Next articleకళ్యాణి తన భర్త సూర్య కిరణ్ తో విడిపోవడానికి వెనుక కారణం అదేనా?