Ads
మన సినిమాల్లో హీరోయిన్లు ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలా కొంత మంది హీరోయిన్లు సినిమాల్లో టీచర్స్ గా, లేదా లెక్చరర్స్ గా నటించారు. ఆ హీరోయిన్లు ఎవరో, వాళ్లు టీచర్ పాత్రలు పోషించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 సుహాసిని – ఆరాధన
సుహాసిని గారు ఆరాధన సినిమాలో టీచర్ పాత్ర పోషించారు.
#2 ఇలియానా – ఖతర్నాక్
రవితేజ హీరో నటించిన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా టీచర్ పాత్ర పోషించారు.
#3 సాయి పల్లవి – ప్రేమమ్ (మలయాళం)
మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ లో సాయి పల్లవి టీచర్ పాత్ర పోషించారు.
#4 నయనతార – నేనే అంబానీ
ఆర్య హీరోగా నటించిన నేనే అంబానీ సినిమాలో నయనతార లెక్చరర్ గా నటించారు.
#5 సమంత – సీమ రాజా
శివ కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజా సినిమాలో సమంత స్పోర్ట్స్ టీచర్ గా నటించారు.
#6 అనుపమ పరమేశ్వరన్ – రాక్షసుడు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ టీచర్ పాత్ర పోషించారు.
#7 ఆసిన్ – ఘర్షణ
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో ఆసిన్ టీచర్ పాత్ర పోషించారు.
Ads
#8 రమ్యకృష్ణ – కొంచెం ఇష్టం కొంచెం కష్టం
సిద్ధార్థ్ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో రమ్యకృష్ణ లెక్చరర్ గా నటించారు. అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో రమ్యకృష్ణ టీచర్ పాత్ర పోషించారు.
#9 నందిత శ్వేత – అక్షర
ఇటీవల విడుదలైన అక్షర సినిమాలో నందిత శ్వేత ప్రొఫెసర్ గా నటించారు.
#10 విజయశాంతి – సరిలేరు నీకెవ్వరు
విజయశాంతి గారు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా లో ప్రొఫెసర్ గా నటించారు. ఈ ఈ సినిమా తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో టీచర్ పాత్ర పోషించారు.
#11 కమలిని మఖర్జీ – హ్యాపీడేస్
హ్యాపీడేస్ సినిమాలో కమలిని ముఖర్జీ టీచర్ పాత్ర పోషించారు.
#12 స్వాతి – గోల్కొండ హై స్కూల్
ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో స్వాతి టీచర్ పాత్ర పోషించారు.
#13 శృతి హాసన్ – ప్రేమమ్ (తెలుగు)
నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో శ్రుతి హాసన్ లెక్చరర్ గా నటించారు.