“స్కంద” ట్రైలర్ లో కనిపించిన ఈ అమ్మాయి గురించి తెగ వెతికేస్తున్నారు అంట.? ఆమెని గుర్తుపట్టారా.?

Ads

పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో రామ్ కాంబినేషన్ లో విడుదల కాబోతున్న హై వోల్టేజ్ మూవీ స్కంద అని అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను మూవీ అంటే ఎంత హై వోల్టేజ్ యాక్షన్ తో కూడి ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇక హీరో ఎలివేషన్స్ సీన్స్ బోయపాటి ఓ రేంజ్ లో తీస్తాను.

బోయపాటితో సినిమాలు చేసి బాలకృష్ణ కాకుండా రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాసివ్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన కెరీర్లో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ బోయపాటితో మూవీ చేయడం అంటే నెక్స్ట్ సూపర్ డూపర్ హిట్ అనే అందరూ ఆశిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

watch video:

మూవీ రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా మొదలయ్యా.. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం బోయపాటి స్టైల్ యాక్షన్‌తో అలరించింది. ఈసారి కూడా రక్తపాతం మామూలుగా ఉండదని బోయపాటి ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే ఒక అమ్మాయికి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. “కనిపించని దేవుని కనిపించమని అడుగుతాం కానీ, పెంచే దేవుళ్ళని పట్టించుకోకపోతే ఎలా మామయ్య?” అని రామ్ పోతినేని ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ సమయంలో ఒక్కక్షణం కెమెరా ఒక అమ్మాయి ముఖం మీద జూమ్ అవుతుంది.

అందానికి మారుపేరుగా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అమ్మాయి ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్. అమ్మాయి పేరే అమృత చౌదరి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగ్స్ తో సాగే ఈ ట్రైలర్ మంచి మాస్ టచ్ తో సాలిడ్ ఎంటర్టైనర్ గా ఉంది. ఇక ఇందులో ఆద్యంతం ప్రతి డైలాగులు బోయపాటి ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది. రెండు ఊర్ల మధ్య జరిగే పదవి పోరాటంలో హీరో కుటుంబం పై విలన్ కన్ను వేయడం…హీరో చెల్లెల్ని విలన్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం.. తర్వాత ఆమెను వారు చంపేసినట్లు చూపిస్తారు.

కథ రొటీన్ గా ఉన్నప్పటికీ కథనం వెరైటీగా ఉండొచ్చు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అమృత చౌదరి కి ఇన్స్టా లో 679 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2022లో విడుదలైన ద రాక్ స్టార్ అనే చిత్రంలో అమృత హీరోయిన్ గా నటించింది. అయితే ఇన్స్టా లో మాత్రం ఎప్పటికప్పుడు వీడియోస్ మరియు పిక్స్ తో నెటిజన్స్ కు కనువిందు చేస్తూ ఉంటుంది.

Previous articleఇండియాలో టాప్ 5 అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఇవే…మన తెలుగురాష్ట్రాల్లోవి ఏ స్టేషన్ అయినా ఉందేమో చూడండి.!
Next articleబిగ్ బాస్ హౌస్ గడప వరకు వచ్చి…చివరి నిమిషంలో ఎంట్రీ ఇవ్వకుండా వెనక్కి తిరిగిన 6 సెలబ్రిటీస్ వీళ్లే!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.