Ads
ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆదిపురుష్ సినిమా శుక్రవారం (ఈరోజు) థియేటర్ల లో విడుదల అయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
సినిమా : ఆదిపురుష్
నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులు
నిర్మాత : భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్,
దర్శకత్వం : ఓం రౌత్
ఛాయాగ్రహణం : కార్తీక్ పళని
సంగీతం : అజయ్-అతుల్
విడుదల తేదీ: జూన్ 16, 2023
స్టోరీ:
అరణ్య కాండం నుండి కథ మొదలవుతుంది. తండ్రి మాట కోసం రాఘవుడు (ప్రభాస్) భార్య జానకి(కృతిసనన్), తమ్ముడు శేషు (సన్నీసింగ్) లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. లంకేష్ (సైఫ్ అలీఖాన్ ) జానకిని మాయోపాయంతో ఎత్తుకెళతాడు. రాఘవుడు వానరసైన్యం సహకారంతో లంకేష్ పై యుద్ధానికి వెళతాడు. రాఘవుడు లంకేష్ మాయాల్ని ఛేదిస్తూ యుద్ధంలో ఎలా గెలిచాడు అనేది ఆదిపురుష్ మూవీ కథ.
రివ్యూ:
Ads
రామాయణగాథ అందరికి తెలిసిన కథ. తెలిసిన కథను చాలా ఆసక్తికరంగా చెప్పాలి. రామాయణం పైన ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.’ఆదిపురుష్’ ఓం రౌత్ ఎలా తీశారు అనే విషయానికి వస్తే,ఈ చిత్రం విజువల్స్ తో కొత్తగా అనిపిస్తుంది. త్రీడీ ఎఫెక్ట్స్ కొన్నిచోట్ల బావున్నాయి. భావోద్వేగాలు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనిపిస్తుంది ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సులో కనిపించిన ఇంటెన్సిటీ, ద్వితీయార్ధంలో యుద్ధానికి సంబంధించిన సీక్వెన్సులు ఇవ్వలేదు. ఎక్కువ విజువల్స్ పైన పెట్టిన దృష్టి సీన్స్ మీద పెట్టలేదు. తెలిసిన స్టోరీ కావడంతో చాలా స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
ప్రథమార్థం స్లోగా ఉన్నప్పటికీ, పెద్దగా కంప్లైంట్స్ లేకుండా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యుద్ధ సన్నివేశాలు, డైలాగులు బాహుబలి మూవీని గుర్తు చేస్తాయి.ఈ మూవీ నిడివి 3 గంటలు అయినా పాటలు, నేపథ్య సంగీతం వల్ల ఆ భావన రాదు. విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వల్ తెలిసిన సీన్స్ అయినప్పటికీ కొత్త ఫిల్ కలుగుతుంది.
ప్రభాస్ రాఘవుడు పాత్రలో ఒదిగిపోయారు. ఆయన నటన, ఆహార్యం ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. జానకిగా కృతి సనన్ కనిపించే సీన్స్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. ప్రభాస్, కృతి సనన్ జంట బావుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటన, ఆహార్యం, ఆకట్టుకోవడం కష్టం. ప్రభాస్ కన్నా సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంది. శేషు సన్నీ సింగ్, హనుమంతునిగా దేవదత్త తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ప్లస్ పాయింట్స్:
ప్రభాస్ ఎంట్రీ
ప్రథమార్థం
బీజీఎం
పాటలు
మైనస్ పాయింట్లు:
రన్‌టైమ్ ఎక్కువ
తగ్గిన ఎమోషన్
యావరేజ్ వీఎఫ్ఎక్స్
రావణుడి ఆహార్యం
ఊహించదగిన సన్నివేశాలు
రేటింగ్:
2.75/5