Ads
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని ఆటలలో కంటే క్రికెట్ ఎంతో ఆకర్షణీయమైన క్రీడగా పరిగణింపబడుతుంది. 140 కోట్లు జనాభా కలిగిన భారత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన ఆట…నేషనల్ గేమ్ హాకీ కాదు.. విదేశీ గేమ్ క్రికెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం ఒక్క ఇండియా పరిస్థితి కాదు ప్రపంచ దేశాలు అన్నిటిలోనూ ఎక్కువ క్రేజ్ ఉండే ఆట క్రికెట్. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది.
అక్టోబర్ ఐదు 2023 నుంచి ప్రారంభమైనప్రారంభమైన ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఒకటైన ఈ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ నవంబర్ 19 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం ఈ వరల్డ్ కప్ పైనే ఉండడంతో మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్ రేట్ విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో ఒక పది సెకండ్ల స్లాట్ కోసం కంపెనీలు 30 లక్షల వరకు ఖర్చు పెడతాయి. అంటే మ్యాచ్ లో వచ్చే ప్రతి సెకండ్ యాడ్ కి మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ రేట్ గత ప్రపంచ కప్ తో పోలిస్తే 40 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు మరి.
Ads
క్రికెట్ …ఎక్కువమంది చూసే ఈ ఆటను ప్రత్యక్షంగా పరోక్షంగా దేశంలో కోట్లాదిమంది వీక్షించడం జరుగుతుంది. అందుకే ఈ ఈవెంట్ కోసం కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి జనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో నే అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా భారత్ కి గుర్తింపు ఉంది.. అందుకే ఇండియాలో తమ సంస్థల అభివృద్ధి కోరుకునే బడాబడా ఇంటర్నేషనల్ కార్పొరేట్ సంస్థలు గ్లోబల్ కంపెనీలు ఈ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ను వేదికగా మార్చుకుంటున్నాయి.
ఈ ఒక్క ఈవెంట్ కోసం పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ కలిసి ప్రకటనల కోసమే కేవలం 240 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మన లెక్క ప్రకారం రెండు వేల కోట్లు.. అంటే మన క్రీడా వ్యయంలో 85%తో సమానం. ఇలా ఖర్చు చేయడానికి ముందుకు వచ్చే గ్లోబల్ బ్రాండ్స్ లో కోకా కోలా,గూగుల్ పే,హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్,ఆరామ్కో,ఎమిరేట్స్,నిస్సాన్ మోటార్ వంటి బడా బ్రాండ్లు ఉన్నాయి.