Agent movie review: అఖిల్ అక్కినేని ”ఏజెంట్” సినిమా హిట్టా..? ఫట్టా..?

Ads

సినిమా: ఏజెంట్
నటీనటులు : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముటి, డినో మోరియా, ఊర్వశి రౌటేలా తదితరులు
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీప రెడ్డి
సంగీతం : హిప్ హాప్ తమిళ
విడుదల తేదీ :ఏప్రిల్ 28, 2023

స్టోరీ :

యాక్షన్ ఫిలిం గా ఏజెంట్ సినిమా తెర మీదకి వచ్చింది. ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమయ్యారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆడియన్స్ కి అందించాలని సురేందర్ రెడ్డి ఈ సినిమా ని తెర మీదకి తీసుకువచ్చారు. అఖిల్  RAW ఏజెంట్ అవ్వాలని అనుకుంటాడు. అందుకోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

సినిమా మహదేవ్ (మమ్ముట్టి) అని ఒక చీఫ్ తో స్టార్ట్ అవుతుంది. మహదేవ్ ఒక మిషన్ మీద ఉంటారు. అయితే గాడ్ (డినో మోరియా) అనే ఒక డాన్ ని పట్టుకోవాలి. అందుకోసం అందరు ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైం లో రామకృష్ణ (అఖిల్ అక్కినేని) ఓ హ్యాకర్ మహదేవ్ తో కలిసి వారి ఏజెన్సీలో పని చేయడానికి.. అతన్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అయితే వాళ్ళతో రామకృష్ణ వారితో కలిశాడా..? ఆ తర్వాత రామకృష్ణ కి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి…? చివరకి మిషన్ ని పూర్తి చేశాడా..? వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడు.. ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ ని చూడాల్సిందే.

రివ్యూ:

Ads

అఖిల్ అక్కినేని ఈ సినిమాలో కొత్తగా కనపడతాడు. ఫిజికల్ గా కూడా ఎన్నో మార్పులు కనబడ్డాయి. మంచి నటనతో అఖిల్ ఆకట్టుకున్నాడు. స్పెషల్ ఏజెంట్ గా నటించిన మమ్ముట్టి కూడా ఎంతో చక్కగా నటించారు. అన్ని సినిమాల్లో ఎలా అయితే నటనతో ఆకట్టుకుంటారో మమ్ముట్టి అదే విధంగా ఈ సినిమాలో కూడా ఆకట్టుకున్నారు. స్క్రీన్ మీద కొత్తగా పరిచయమైన సాక్షి వైద్య కూడా బాగా ఆకట్టుకున్నారు. డినో మోరియా టాలీవుడ్ లో మొదటి సినిమాలో నటించారు. పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా డిసప్పాయింట్ అయితే చేయలేదు. చాలా రొటీన్ గా ఈ సినిమా కథ ఉంది.

ఇంకాస్త కథని మోడిఫై చేసి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ లొకేషన్స్ అయితే బాగున్నాయి. గన్ తో బుల్లెట్ల వర్షం కురిపించడం స్టంట్ లు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే గూస్బమ్స్ తెప్పించేస్తాయి. అఖిల్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అని తెలుస్తోంది. బీజీఎమ్ కాస్త భయంకరంగా ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి. అయితే అఖిల్ ఎంత కష్టపడినా స్టోరీ రొటీన్ గా ఉండడంతో మళ్లీ అఖిల్ కి డిజాస్టర్ తప్పలేదు. స్టోరీ కూడా లాజిక్ లేకుండా ఉంది, ఈ సినిమా పాటలు, బీజీఎమ్, విఎఫ్ఎక్స్ మైనస్ అయ్యాయి. లవ్ ట్రాక్ కూడా బోరింగ్ గా ఉంది. క్లైమాక్స్ కూడా డిస్సపాయింట్ చేసింది.

ప్లస్ పాయింట్స్:

  • నిర్మాణ విలువలు
  • ఫైటింగ్ సీన్స్
  • అఖిల్ నటన
  • నటీ, నటులు
  • కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సాగదీత సన్నివేశాలు
  • కొంచెం ఓవర్ గా అనిపించే కొన్ని సీన్స్
  • క్లైమాక్స్
  • లవ్ స్టోరీ
  • మొదటి హాఫ్

రేటింగ్: 2.5/5

Previous articleఊర్లో మనుషులు ఉండాలి కానీ… మనిషిలా ఉందేంటి ఈ ఊరు..!
Next articleఅమ్మాయిలు జాగ్రత్త.. ర్యాపిడో బైక్ పై వెళ్ళేవాళ్ళు తప్పక ఇది చూడాలి..!