Ads
నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మరణ వార్త నందమూరి ఫామిలి మెంబర్స్ ను కలిచి వేస్తుంది. తారకరత్న పెద్దకర్మను మార్చి 2న ఫిలిం క్లబ్ లో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి తారకరత్న తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.
అయితే తారకరత్న పెద్దకర్మ రోజున అలేఖ్య రెడ్డి భర్త తనకు రాసిన ప్రేమలేఖని ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. ఈ ప్రేమలేఖని చదివితే తారకరత్నకు భార్య అలేఖ్య పై ఎంత ప్రేమ ఉందో, ఆమెని ఎంతగా ప్రేమించాడో తెలుస్తుంది. ఈ లెటర్ చదివిన వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. తారకరత్న తన భార్య అలేఖ్యకు రాసిన ఆ ప్రేమలేఖలో ఏం రాశాడు అనేది చూద్దాం..
తన భార్య అలేఖ్యకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్తూ, నాకు ఎదుటివారి పై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం తెలియదు. నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివే, నువ్వే నా లోకం బంగారు తల్లి అని తారకరత్న అలేఖ్య మీద ఉన్న ప్రేమను తెలిపారు. తారకరత్న రాసిన ఈ ప్రేమలేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండడంతో అది చదివి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ ప్రేమలేఖని షేర్ చేస్తూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు.
మనం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ఎన్నో ఒడిదుడుకులను చూసాం. వాటిని దాటి చాలా దూరం వచ్చేసాం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మంచి రోజుల కోసం ఎంతగానో ఎదురు చూసాం. మన కోసం చిన్న ఫ్యామిలిని సృష్టించుకున్నాం. నీ గురించి ఎవరికీ ఏమి తెలియదు. నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. బాధనంతా నీలోనే దాచుకున్నావు, మాకు ఎంతో ప్రేమను ఇచ్చావు. చుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా జీవితంలో నిలబడుతాను అంటూ తారకరత్న పై ఉన్న ప్రేమను తెలుపుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.
Also Read: నందమూరి తారకరత్న చివరి కోరిక తీర్చేందుకు సిద్ధపడుతున్న భార్య అలేఖ్య రెడ్డి..
Ads
View this post on Instagram