నందమూరి తారకరత్న చివరి కోరిక తీర్చేందుకు సిద్ధపడుతున్న భార్య అలేఖ్య రెడ్డి..

Ads

నందమూరి తారకరత్న మరణంతో తీవ్ర దుఖంలో మునిగిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. తారకరత్నను ప్రేమించి, వివాహం చేసుకున్న అలేఖ్యా రెడ్డి దుఖాన్ని ఎవరు కూడా  ఆపలేకపోతున్నారు.

నందమూరి తారకరత్న కన్నుమూయడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరణించి రోజులు గడుస్తున్న ఇప్పటికి కూడా  ఆయన లేరనే నిజాన్ని ఆయన ఫ్యామిలీ, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆయన భార్య అలేఖ్యా రెడ్డిని ఎవరు కూడా ఓదార్చలేకపోతున్నారు. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికి  అలేఖ్య మాత్రం తారకరత్న జ్ఞాపకాలతో మానసికంగా ఎంతగానో కృంగిపోతోంది. ఇదిలా ఉంటే తారకరత్న కుటుంబానికి ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ అండగా నిలబడుతున్నారు. అయితే తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డిని కోలుకునేలా చేయడం కోసం బాలకృష్ణ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. అలేఖ్యా రెడ్డిని బిజీగా ఉంచడం కోసం ఆమెను పాలిటిక్స్ లోకి తీసుకు రావాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్టు  తెలుస్తోంది. అలా చేయడం వల్ల రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఎంతగానో అనుకున్న తారకరత్న చివరి కోరికను అలేఖ్య రెడ్డి ద్వారా తీరేట్టుగా  టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ సమాలోచనలు చేస్తున్నారట. అలేఖ్య రెడ్డిని ముందుగా టీడీపీ మహిళా విభాగంలో ముఖ్యమైన పదవి ఇచ్చేలా, ఆ తరువాత రాబోయే ఎలెక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నట్టు  తెలుస్తోంది. ఈ విషయం పై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. సినీ పరిశ్రమలో ట్యాలెంటెడ్‌ నటుడిగా గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న పాలిటిక్స్ లోకి రావాలని ఎంతగానో అనుకున్నాడు.అంతేకాకుండా రాబోయే ఎలెక్షన్స్ లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే నారా లోకేశ్‌ యువగళం పేరుతో మొదలైన పాదయాత్రలోనూ పాల్గొన్నాడు. తానొకటి అనుకుంటే విధి మరోక విధంగా తలచింది. అదే పాదయాత్రలో గుండెపోటుకి గురైన తారకరత్న తన కోరిక తీరకుండానే అందరినీ విడిచి వెళ్లిపోయాడు. ఇప్పుడు తారకరత్న కోరికను ఆయన భార్య అలేఖ్య ద్వారా తీరేలా బాలకృష్ణ ఆలోచిస్తున్నారట. మరి ఈ విషయం గురించి అలేఖ్య రెడ్డి నిర్ణయం ఏమిటో వేచి చూడాలి.

Ads

Also Read: మొదటి రోజు జరిగిన ఆ తప్పే.. తారకరత్న ప్రాణాలు పోవడానికి కారణం అయ్యిందా?

 

View this post on Instagram

 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

Previous articleTop 10 Real Estate Builders and Developers in Hyderabad
Next articleప్రధాని మోదీ హృదయాన్ని తాకిన రెండవ తరగతి బాలుడి లేఖ..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.