Ads
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్, కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా అలరించాడు. తాజాగా సుహాస్ హీరోగా తెరకెక్కిన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” మూవీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.
- నటీనటులు: సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరుల
- దర్శకుడు: దుశ్యంత్ కటికనేని
- సంగీతం: శేఖర్ చంద్ర
- నిర్మాతలు : ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి
- విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024
కథ:
మల్లికార్జున్ అలియాస్ మల్లి (సుహాస్) అంబాజీపేట బ్యాండ్ లో పనిచేస్తుంటాడు. మల్లి బ్యాండ్ లేకుండా ఆ ఊర్లో ఏ వేడుక జరిగదు. వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న) ఊర్లో పెద్ద మనిషి లాంటి వ్యక్తి. మల్లి అక్క పద్మ (శరణ్య ప్రదీప్) ఆ ఊర్లోనే స్కూల్ లో టీచర్‌గా చేస్తుంటుంది. అయితే ఊర్లో అందరు పద్మకు జాబ్ వెంకట్ వల్ల వచ్చిందని, వారి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలవుతుంది.
ఈ లోగా మల్లి వెంకట్ బాబు చెల్లెలు లక్ష్మీ (శివానీ) ప్రేమించుకుంటారు. అగ్రకులం, డబ్బు ఉందన్న అహంతో వెంకట్ ఎటువంటి అరాచకాలు చేస్తాడు? పద్మ, వెంకట్ మధ్య గొడవ ఏంటి ? ఈ గొడవ వల్ల మల్లి లవ్ స్టోరీ ఏ మలుపు తిరిగింది? చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
Ads
అంబాజీపేట చిత్రంలో చూపించిన స్టోరీ కొత్తది కాదు. గతంలో ఊర్లలో డబ్బు, కులాల మధ్య అంతరం ఎలా ఉండేదో తెలిసిందే. తక్కువ కులాల వారిపై ఎలాంటి వివక్ష చూపించేవారో తెలిసిందే. కుల వృత్తులు కొనసాగించేవారి పై చిన్న చూపు చూడడం, ధనికులు, పేదోళ్లు, లవ్ చుట్టూ అనేక కథలు వచ్చాయి. అయితే వరకహర చిత్రాల్లో చూపించినట్టు ఇది కేవలం ప్రేమ కథ అయితే కాదు. అది కథలో భాగమే. ఇది ఆత్మాభిమానం కోసం ఓ మహిళ చేసే పోరాటం అనవచ్చు. ఈ సినిమాకి సుహాస్ హీరో కానీ మూవీలో శరణ్య చేసిన పద్మ క్యారెక్టర్ హీరోలా కనిపిస్తుంది.
ఈ సినిమాలో నటి నటులంతా తమ క్యారెక్టర్లలో ఒదిగిపోయినా, శరణ్య ప్రదీప్ వారందరినీ డామినేట్ చేసింది. ఆత్మస్థైర్యం కల యువతిగా ఆమె తెగువ, మాటలు, బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఆమె యాక్టింగ్ ఆకట్టుకుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా కనిపిస్తుంది. పాటలు, ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. విజువల్స్ నేచురల్ గా ఉన్నాయి.సుహాస్ ఎప్పటిలానే అద్భుతంగా నటించాడు. కామెడీ సీన్స్ లో నవ్వించి, ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించాడు. హీరోయిన్ గా శివాని బాగానే చేసింది. విలన్‌గా నితిన్ ప్రసన్న న్యాయం చేశాడు.
ప్లస్ పాయింట్స్:
- సుహాస్, శరణ్య నటన,
- డైలాగ్స్
- బ్యాగ్రౌండ్ స్కోర్
- విజువల్స్మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్స్ ,
రేటింగ్:
3/5
ఫైనల్ గా:
ఎమోషన్స్ మెండుగా ఉన్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు , ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చే విధంగా ఉంటుందని చెప్పవచ్చు.
watch trailer :