జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. ఇలాంటి వారికి ఎల్లపుడూ దూరంగా ఉండాలి..

Ads

కొంతమంది ఎన్ని విజయాలను పొందినా, ఎంత డబ్బు ఆర్జించినప్పటికి వారిలో ఎప్పుడూ ఏదో అసంతృప్తి అనేది ఉంటుంది. మితిమీరినటువంటి ఆశ వల్ల వారు ఎన్నో సార్లు తప్పులు చేస్తుంటారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పిన ప్రకారం జీవితంలో కొన్నింటిని పాటించడం వల్ల సంతోషం, సంతృప్తిని పొందుతారు.

చాణక్య నీతి శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్నేహం అతని వ్యక్తిత్వం గురించి తెలియచేస్తుంది. మంచి మనుషులతో చేసే స్నేహం విజయపథంలో నడిపిస్తుంది. అంతే కాకుండా ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంచుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం పొందాలని కోరుకుంటారు. చాణక్యుడు నీతి శాస్త్రంలో మనుషుల విజయాన్ని పొందడానికి కారణం అయ్యే అనేక విషయాలను ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తాడో, వారి ప్రభావం ఆ వ్యక్తి జీవితం పై ఉంటుంది. విజయం, వైఫల్యం అనేవి రెండూ కూడా మనుషుల స్నేహంతో ప్రభావితమవుతాయి. మరి ఎలాంటి వారికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

Ads

  1. ప్రతి విషయాన్ని నెగెటివ్ గా చూస్తూ ప్రోత్సహించకుండా, ఇతరులు నష్టపోయేలా చేసే లేదా మాట్లాడే మహిళకి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అందువల్ల దుష్ట ఆలోచనలు కలిగిన మహిళలకు దూరంగా ఉండాలి. అలాంటి వారికి సాయం చేయడం కూడా హానికరం.
  2. తన ఓటమికి దేవుడిని శపించేవాడికి, ఎల్లప్పుడూ ఇతరులను విమర్శించే వారికి కూడా ఎప్పుడూ  దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులు నెగెటివ్ ఆలోచనలు కలిగేలా చేయవచ్చు. అలాంటి వారితో సహవాసం చేసినవారు ఆనందంగా ఉండలేరు.

3. ఎప్పుడూ కూడా మూర్ఖులతో జీవించకూడదు. వారికి ఏ విషయాన్నీ వివరించాలని కూడా చూడవద్దు.  ఇలా చేయడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడమే. మూర్ఖులు ఎంత చెప్పినా ఎవరి మాట వినరు.

4. ఇతరుల విజయాలను చూసి ఈర్ష్యపడేవారు లేదా వారి లాభం కోసం ఇతరులకు హాని చేసే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారు సులభంగా మోసం చేస్తారు.

Also Read: చాణక్యు నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం బానిస అవుతుంది..

Previous articleMARRIAGE SONG: 12 గుంజల పాట విన్నారా.? ఇకనుంచి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుంది..!
Next articleAmbajipeta Marriage Band Review: “సుహాస్” హీరోగా నటించిన ఈ మూవీ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.