Ads
తెలుగు తేజం ప్రముఖ భారత్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురించి అందరికీ పరిచయమే. తెలుగువాడిగా ఇండియన్ క్రికెట్ లో మంచి పాత్ర పోషించారు. తన బ్యాటింగ్ తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
ఎన్నో కీలక మ్యాచ్ లలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మెరుగైన ప్రదర్శన కనబరిచేవారు.
అయితే తాజాగా క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అంబటి రాయుడు రాజకీయాల వైపు అడిగారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏమైందో తెలియదు గానీ కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు తెలిపారు.
Ads
అంబటి రాయుడు కుటుంబ నేపథ్యానికి వస్తే తండ్రి పేరు అంబటి సాంబశివరావు, తల్లి పేరు విజయలక్ష్మి. అంబటి రాయుడు తండ్రి ఆర్చివ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. అంబటి రాయుడు క్రికెట్లోకి రావడం తన తండ్రి ఇన్స్పిరేషన్ వల్లే అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అంబటి రాయుడు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా. ఇక 2009 ఫిబ్రవరి 14న కాలేజీ ఫ్రెండ్ అయినా చెన్నుపల్లి విద్యాని అంబటి రాయుడు వివాహం చేసుకున్నాడు. అయితే తనకున్న అనుభవంతో రాబోయే రోజుల్లో క్రికెట్లోకి రావాలనుకున్న యువతకి సహాయ సహకారాలు అందిస్తానని రాయుడు చెప్పుకొచ్చాడు.