Ads
యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆమ్రపాలిని తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసి కమిషనర్ పదవిలో నియమించారు. గతవారం ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆమ్రపాలి. నగరవాసులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఆమ్రపాలి తాను చేయాల్సిన పనులని చేయడం మొదలుపెట్టారు. సాధారణ అమ్మాయిలాగా వచ్చి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సాధారణంగా ఆమ్రపాలి చీరల్లో కనిపిస్తూ ఉంటారు. కానీ అందరిలో ఒకరి లాగా వచ్చి హైదరాబాద్ లో తనిఖీలు చేశారు. కూకట్ పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ, భరత్ నగర్ లో ఉన్న రైతు బజార్లలో కూడా ఆమ్రపాలి తనిఖీలు చేపట్టారు.
Ads
శానిటేషన్ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం మీద దృష్టి సారించారు. నారాయణగూడ క్రాస్ రోడ్ దగ్గర శానిటేషన్ గురించి తనిఖీలు చేసి, ఆ తర్వాత కమిషనర్ గారు నిర్మించిన మార్కెట్ గదులని కేటాయించే ప్రక్రియ పనులు పూర్తి చేయాలి అని ఆమ్రపాలి జోనల్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేశారు. శంకర్ మఠ్ దగ్గర ఉన్న రాంకీ ఆర్ ఎఫ్ ఎఫ్ సి వెహికల్ డ్రైవర్ తో కూడా మాట్లాడి చెత్త తరలింపు ఎలా జరుగుతోంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. డ్రైనేజీల దగ్గర ఎలాంటి చెత్త ఉండకుండా, రోడ్ల మీద కూడా చెత్త లేకుండా ఎప్పటికి అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి అని చెప్పారు.
స్కూల్ కి వెళ్తున్న ఒక విద్యార్థినితో కూడా ఆమ్రపాలి మాట్లాడారు. తన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అని, చెత్తని స్వచ్ఛ ఆటో లకు అందించాలి అనే విషయం మీద తన తోటి విద్యార్థులకి అవగాహన కల్పించాలి అని ఆమ్రపాలి ఆ విద్యార్థినితో చెప్పారు. ఈ తనిఖీలో ఆమ్రపాలితో పాటు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ కూడా పాల్గొన్నారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అంటే చెత్తని పోసే స్థలాలు తొలగించాలి అని, దాని మీద దృష్టి పెట్టాలి అని ఆమ్రపాలి ఆదేశించారు. వీధులు శుభ్రంగా ఉంచాలి అని, ఎక్కడా చెత్త ఉండకుండా చూసుకోవాలి అని ఆమ్రపాలి ఆదేశించారు.