బాహుబలిని మించిన సీన్స్… ఎన్నో సినిమాలకు ఇదే ఇన్స్పిరేషన్..! ఈ సిరీస్ చూశారా..?

Ads

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచ టెలివిజన్ హిస్టరీలోనే ఈ షోకి వచ్చినంత పాపులారిటీ ఇంకే షోకి దక్కలేదని చెప్పవచ్చు. మొదట హెచ్బీవో ఛానల్ లో 2011 నుంచి 2019 వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రసారం అయ్యింది. దీనికి వచ్చిన ఆదరణ చూసి, వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ లభించింది. కేవలం ఈ సిరీస్ చూడడం కోసమే చాలా మంది నెట్ ఫ్లిక్స్ కు సబ్ స్క్రైబర్స్ అయ్యారు. GOT వీక్స్ అని స్నేహితులతో కలిసి నైట్ అవుట్ చేసి ఈ వెబ్ సిరీస్ చూసేవాళ్లు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి తెలుగు ఆడియెన్స్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు.

show which had great story than bahubali

తెలుగులో అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూసినవారెంతో మంది ఉన్నారు. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదని చాలా మంది ఫ్యాన్స్ బాధ పడుతుండేవారు. అయితే త్వరలో తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మారింది. కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో లేదు.

Ads

ఆ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న తరువాత జియో సినిమా భారతీయ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా స్ట్రీమ్ అవుతుంది అని జియో తెలిపింది. ఈ న్యూస్ విన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు ప్రాంతీయ భాషలలో స్ట్రీమ్ అవుతుందా అని చూశారు. ఇప్పుడు ఈ సిరీస్ తో పాటు దీనికి కొనసాగింపుగా వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కూడా ఇందులో స్ట్రీమ్ అవుతోంది.

ఇది ఇలా ఉంటే బాహుబలి 2 సినిమాలోని సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ చేశారని బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినపుడు విమర్శలు వచ్చాయి. బాహుబలి పై నుండి వస్తున్న అగ్ని బాణాలకు ఆకాశం వైపు చూస్తూ చేతులు తెరుస్తాడు. ఇలాంటి సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉంటుంది. అలాగే అమరేంద్ర బాహుబలి ఖడ్గం లాంటి ఆయుధం కూడా ఆ సిరీస్ లో కనిపిస్తుంది.

Previous articleపెళ్లయ్యాక ఆడవారు అత్తమామలతో కలిసి ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు..? కారణాలు ఇవేనా..?
Next articleకొత్త లుక్ లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన ఈ ఆఫీసర్ ఎవరో చూశారా..? విషయం ఏంటంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.