Ads
విజయ్ దేవరకొండ తమ్ముడు గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
అందులో ఆనంద్ నటన విమర్శకులను సైతం మెప్పించింది. అయితే నిజంగానే ఆనంద దేవరకొండ రియల్ లైఫ్ లో కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అనే సంగతి చాలామందికి తెలియదు.
మిడిల్ క్లాస్ మెలోడీస్, దొరసాని, పుష్పకవిమానం, బేబీ వంటి సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో బిజీగా ఉన్న ఆనంద్ దేవరకొండ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడుతూ నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను, ఆ అమ్మాయికి చదువు అంటే ఎంతో ఇష్టం. అందుకే పై చదువుల కోసం చికాగో వెళ్లిపోయింది. నేను కూడా అమెరికా వెళ్లి చదువుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.
Ads
దాంతో చికాగో చుట్టుపక్కల ఉన్న టాప్ ఫైవ్ బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు కోసం అప్లై చేశాను. సీటు కూడా వచ్చింది. ఇంజనీరింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరగటానికి స్వేచ్ఛ దొరుకుతుంది అని భావించాను కానీ అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ సమయంలో నా హార్ట్ బ్రేక్ అయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ అమ్మాయిని చాలా సిన్సియర్ గా ప్రేమించాను కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.
బ్రేకప్ నుంచి బయట పడటానికి నాకు చాలా సంవత్సరాలు టైం పట్టింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలోనే జాబ్ చేశాను అన్నారు ఆనంద్. అయితే అంత బాధలో కూడా ఇంజనీరింగ్ చదువుని పూర్తి చేసి సంవత్సరానికి 40 లక్షల శాలరీ వచ్చే జాబు చేశారు ఆనంద్ నిజంగా గ్రేట్ కదా. ఇంటర్వ్యూ చూసిన తర్వాత బేబీ సినిమాలో ఒక లవ్ ఫెయిల్యూర్ గా అంత బాగా అందుకే నటించగలిగారు అంటున్నారు ప్రేక్షకులు.