Ads
భారత అపర కుబేరుడు, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. మార్చు ఒకటి నుంచి మూడు మధ్య జరిగిన ఈ ప్రి వెడ్డింగ్ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.
గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అడుగడుగునా అంబానీల వైభవం కనిపిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకలకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగర్ బర్గ్ దంపతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Ads
జుకర్ బర్గ్ ఫ్యామిలీతో అనంత్ అంబానీ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అంబానీ మర్యాదల గురించి జుకర్బర్గ్ దంపతులతో మాట్లాడుతూ ఇక్కడ ప్రదేశాలు ఏమన్నా చూడాలనుకుంటే ఏర్పాట్లు చేస్తాను అని వారితో చెబుతున్నప్పుడు జుకర్బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ అనంత్ చేతికి ఉన్న ఖరీదైన డిజైనర్ వాచ్ ని ఆసక్తిగా పరిశీలిస్తుంది. ఈ వాచ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అంటుంది. ఇప్పటికే అతనికి నేను ఆ విషయం చెప్పాను అంటాడు మార్క్.
Mark Zuckerberg & his wife Priscilla was surprised to see Anant Ambani's watch. Anant was seen carrying beautiful audemars piguet royal oak open worked skeleton worth INR 14 crore. 🤑#AnantRadhikaWedding | #AnantAmbani pic.twitter.com/DEql5XFWUA
— Radhika Chaudhary (@Radhika8057) March 3, 2024
నిజానికి నాకు వాచ్ లు అంటే అసలు ఇష్టం ఉండదు కానీ అంబానీ చేతి గడియారం చూస్తే మనసు మార్చుకోవాలి అనిపిస్తుంది అని అన్నాడు జుకర్బర్గ్.ఆ వాచ్ ఆడేమర్స్ ప్యూగట్ రాయల్ వర్క్ ఓపెన్ వర్క్ డ్ స్కెలెటన్ అని, దాని ఖరీదు 14 కోట్లు అని అనంత్ చెప్పటంతో ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ వాచ్ నాకు కావాలి అని ప్రిసిల్లా అడగటం,మార్క్ నో చెప్పడం కూడా చూడొచ్చు. రోల్స్ రాయిస్ కార్ల కంట ధర ఎక్కువైనా ఈ వాచీ ప్రత్యేకతలు ఏమిటా అని సెర్చింగులు మొదలుపెట్టారు నెటిజెన్స్.