2003 లో మూసివేసే పరిస్థితి నుండి “డైరీ మిల్క్” ఎలా బయటపడిందో తెలుసా? అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?

Ads

డెయిరీ మిల్క్ చాక్లెట్లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది క్యాడ్బరీ సంస్థ. చాలామంది క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలు ఈ చాక్లెట్లను ఎంతో ఇష్టపడతారు. ‘మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం..’ అనేది ఈ దీని టాగ్ లైన్. చాకొలేట్ బ్రాండ్స్ లోనే టాప్ గా ఉన్న ఈ కంపెనీ ఒక 20 ఏళ్ల క్రితం క్రితం చాలా ఇబ్బందుల్లో పడింది. దాని నుంచి ఈ సంస్థ ఎలా బయట పడిందో ఇప్పుడు చూద్దాం..

2003 వ సంవత్సరం లో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకోలెట్స్ లో పురుగులు ఉన్నట్లు చాలా మంది వినియోగదారులు ఫిర్యాదులు చేసారు. వెంటనే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పూణే ప్లాంట్ నుంచి తయారైన అన్ని చాకోలెట్స్ ని సీజ్ చేసారు. అయితే దానికి కారణం వ్యాపారాలు వాటిని సరిగా నిల్వ చేయకపోవడమే అని క్యాడ్బరీ సంస్థ తన వాదన వినిపించింది. కానీ దానికి ఎఫ్డీఏ కమిషనర్ పరిశుభ్రతను పాటించక పోవడం, ప్యాకేజింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైందని తేల్చి చెప్పారు.

Ads

ఈ పరిస్థితుల వల్ల క్యాడ్బరీ సంస్థ సేల్స్ 30 శాతం తగ్గిపోయాయి. ఆ తర్వాత క్యాడ్బరీ సంస్థ ప్యాకేజింగ్ లో పలు మార్పులు చేసింది. అప్పటి నుంచి డైరీ మిల్ చాకొలేట్ డబల్ ప్యాకేజింగ్ తో వస్తోంది. దీని కోసం 15 కోట్లు పెట్టి ఇంపోర్టెడ్ మెషిన్లను తెప్పించారు. దీని వల్ల 10 శాతం చాకొలేట్ మేకింగ్ ప్రైస్ పెరిగింది కానీ చాకొలేట్ రేట్ ని పెంచలేదు ఆ సంస్థ.

అంతే కాకుండా చాకొలేట్ క్వాలిటీ ని చెక్ చేసేందుకు చాలా మంది ఉద్యోగులను ప్రతి చోట ఏర్పాటు చేసారు. దీనికి ప్రాజెక్ట్ విశ్వాస్ అనే పేరు పెట్టారు. అన్ని రిటైల్ స్టోర్స్ లో క్వాలిటీ మేనేజెర్స్ ని నియమించారు. దాంతో పాటు సేల్స్ పెంచేందుకు మార్కెటింగ్ స్ట్రాటజీ ని కూడా ఉపయోగించారు. కొత్త చాకోలెట్స్ ని పెట్టి అమితాబ్ బచ్చన్ తో కొత్త యాడ్స్ చేయించారు. దాంతో డైరీ మిల్క్ సేల్స్ ఆరు నెలల్లో మళ్ళీ పెరిగాయి.

వినియోగదారుల సమస్యను వెంటనే పరిష్కరించడం లో క్యాడ్బరీ సంస్థ వెంటనే స్పందించటం వారికీ పెద్ద ప్లస్ అయ్యింది. ఒక బాడ్ పబ్లిసిటీ ని ఎదుర్కొని ఒక కంపెనీ ఎలా ఎదిగింది అని తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ.

Previous articleNARA LOKESH: తాడేపల్లిగూడెం సభలో కనిపించని లోకేష్.. అదే కారణమా.?
Next articleANANT AMBANI WATCH: అనంత్ అంబానీ “వాచ్” చూసి ఫ్లాట్ అయిన మిస్సెస్ జూకర్ బర్గ్.. ధర తెలిసి షాకైన వైనం!