Ads
సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి మంచి కలలు వస్తే ఒక్కొక్కసారి పీడకలలు వస్తూ ఉంటాయి. మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామొ అటువంటి కలలు మనకి సాధారణంగా వస్తూ ఉంటాయి. చదువుకునే పిల్లలకి మార్కుల గురించి క్లాసుల గురించి కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉద్యోగం కోసం వెతుక్కునే వారికి ఉద్యోగం మీద కలలు వస్తూ ఉంటాయి. ఇలా ఏదో ఒక కల ప్రతి ఒక్కరికి సహజంగా వస్తూ ఉంటుంది.
మనం నిద్రపోయినప్పుడు మన మెదడు పనిచేస్తూ ఉంటుంది. దీని మూలంగానే కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనల్ని చాలా భయపెట్టే కలలు వస్తూ ఉంటాయి.
పాము మనల్ని తరుముతూ రావడం.. ఏ దెయ్యమో వెంటాడడం ఇలాంటివి కూడా వస్తాయి. నిజంగా అలాంటి సమయంలో ఎవరికైనా భయం వేస్తుంది. ఒక్కొక్కసారి మనకి పూర్వీకులు కలలోకి వస్తూ ఉంటారు. మీకు కూడా ఎప్పుడైనా మీ పూర్వీకులు కలలోకి వచ్చారా..? నిజానికి మనకి వచ్చే కలలకి అర్థాలు కూడా ఉంటాయి.
Ads
చనిపోయిన వాళ్ళు కనుక మీ కలలోకి వచ్చి నవ్వుతూ వున్నా మిమ్మల్ని ఆశీర్వదించినా ఏదో మంచి జరుగుతోందని దానికి సంకేతం. ఒకవేళ కనుక మీ పూర్వీకులు మామూలుగానే చనిపోతే కచ్చితంగా వాళ్ళు మీ బాగు కోసం చూస్తారట. వారు కనుక మీ కలలో కనపడ్డారంటే మీరు చేసే పనులు చక్కగా పూర్తవుతాయి. మీరు మరింత ముందుకు వెళ్ళగలరు.
వ్యాపారంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏదైనా పనుల విషయంలో కానీ ఖచ్చితంగా సక్సెస్ ని పొందగలరట. అలానే మీ కలలో కనుక పాములు కనబడితే మీ పూర్వీకులు ఎప్పుడు మీ మంచినే కోరుకుంటున్నారని సంకేతం. ఇవన్నీ కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పూర్వీకులు ఎక్కువగా కనపడడానికి కారణం వాళ్ళు మీ మంచిని కోరుకోవడానికి ఏదో ఒక రూపంలో కనపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సైంటిఫిక్ పరంగా చూస్తే మీరు ఎవరైనా చనిపోయిన వ్యక్తిని తలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కలలో కనపడే అవకాశం ఉంది.