“తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు..!” అంటూ… రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” జరగండి సాంగ్ పై 15 మీమ్స్..!

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ తన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుండి జరగండి పాట ఇవాళ విడుదల చేశారు.  తమన్ స్వరపరిచిన ఈ పాటని, దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడారు. ప్రభుదేవా ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అనంత శ్రీరామ్ ఈ పాటని రాశారు.

పాట చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. రియల్ లొకేషన్ ని పోలిన ఒక సెట్ వేసి ఈ పాటని చిత్రీకరించారు. ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు, హీరోయిన్ కియారా అద్వానీ కూడా కనిపిస్తున్నారు. పాటలో వీళ్ళిద్దరి గెటప్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు అంటే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

trending memes on ram charan game changer jaragandi song

పాటల్లో సెట్టింగ్స్, లొకేషన్స్, హీరో హీరోయిన్స్ వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఈ పాటలో కూడా అలాగే ఉన్నాయి. ఒక సందర్భంలో రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ మీద కియారా అద్వానీ ఫోటోలు ఉన్నాయి. ఇలాంటి ఐడియాలు శంకర్ కి తప్ప మరి ఎవరికి కూడా రావు ఏమో. ఈ పాట చాలా సార్లు విడుదల చేద్దాం అనుకొని వాయిదా వేశారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు కంటే మంచి సందర్భం ఏం ఉంటుంది. అందుకే ఇవాళ ఈ పాటని విడుదల చేశారు. ఉదయం 9 గంటలకి ఈ పాటని విడుదల చేశారు.

అంటే ఒక రకంగా రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఈ పాటతోనే మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల వైజాగ్ లో కొన్ని రోజులు ఈ సినిమా సీన్స్ చిత్రీకరించారు. అందులో రామ్ చరణ్ తో పాటు, హీరోయిన్ కియారా అద్వానీ, మరొక హీరోయిన్ అంజలి, హీరో శ్రీకాంత్, ఎస్ జె సూర్య కూడా పాల్గొన్నారు.

Ads

ఈ సినిమాలో ఒక్కొక్క పాటకి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ స్టెప్స్ కంపోజ్ చేశారు. ఒక పాటకి జానీ మాస్టర్, ఒక పాటకి బాస్కో మార్టిస్, ఒక పాటకి గణేష్ ఆచార్య, ఈ పాటకి ప్రభుదేవా, ఇంకొక పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ గా వ్యవహరించారు. భారతదేశంలో ఉన్న టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఈ పాట మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

watch video :

Previous articleకలలో మీ పూర్వికులు కనపడ్డారా..? ఏం అవుతుందంటే..?
Next articleఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల కంటే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు బెస్ట్ ఆ..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.