సాంగ్ సూపర్ అంటూ.. జైలులో చంద్రబాబు ఏఐ వీడియోని పోస్ట్ చేసిన అనితారెడ్డి..!

Ads

ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాలతో పాటుగా, జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయ్యి, దాదాపు 45 రోజులు నుండి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జైల్లో చంద్రబాబు ఏఐ వీడియోని అనితారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏపీ స్కిల్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయనకు మద్ధతుగా పలు రంగాలకు చెందినవారు నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు మద్ధతుగా నిలిచి, అరెస్ట్ ను ఖండించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ  శ్రేణుల చేస్తున్న నిరసనలు 40వ రోజు కొనసాగుతున్నాయి.

Ads

చంద్రబాబు పై స్కిల్ స్కామ్ కేసు మాత్రమే కాకుండా మరో రెండు కేసులు కూడా సిఐడి చేర్చిందనే విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు తరుపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 9కి వాయిదా వేసింది. మరో వైపు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారని తెలుస్తోంది.
చంద్రబాబు జైలులో ఉన్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఒక వీడియోను తాజాగా అనిత రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోకి ఆ నలుగురు మూవీలోని ఒక్కడై రావడం సాంగ్ ని యాడ్ చేసారు.

Also Read: “నిజం గెలవడం వల్లే చంద్రబాబు జైల్లో ఉన్నారు..! అంటూ… “నారా భువనేశ్వరి” యాత్రపై కొడాలి నాని కామెంట్స్..!

 

Previous articleఇదెక్కడి క్రియేటివిటీ బాబు.. ప్రమోషన్స్ తోనే కామెడీ పండించేస్తున్నారుగా..?
Next articleఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఇలా భిక్షాటన చేస్తూ..? సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.