“అన్నపూర్ణ ఫోటో స్టూడియో ” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Ads

’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావు హీరోగా నటించిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. ‘ఓ పిట్ట కథ’ డైరెక్టర్ చెందు ముద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీ పై కొంత బజ్ ఏర్పడింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • సినిమా : అన్నపూర్ణ ఫోటో స్టూడియో
  • నటీనటులు: చైతన్య రావ్, లావణ్య,మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, తదితరులు..
  • నిర్మాత: యష్ రంగినేని
  • దర్శకత్వం : చెందు ముద్దు
  • సినిమాటోగ్రఫీ : పంకజ్ తొట్టాడ
  • సంగీతం : ప్రిన్స్ హెన్రీ
  • విడుదల తేది: జులై 21, 2023

స్టోరీ:

1980ల నేపథ్యం ఉన్న స్టోరీ ఇది. గోదావరి పక్కన ఉండే కపిలేశ్వరపురం అనే గ్రామంలో చంటి(చైతన్య రావు) అమ్మ పేరుతో అన్న‌పూర్ణ ఫొటో స్టూడియోను ఫ్రెండ్ తో కలిసి న‌డుపుతుంటాడు.చంటి తండ్రి పేరుమోసిన జ్యోతిష్యుడు కావడంతో చుట్టు ప‌క్క‌ల ఊర్లలో కూడా మంచి పేరు ఉంటుంది.వయసు మీద పడిన చంటికి పెళ్ళికాకపోవడంతో అతని ఫ్రెండ్స్ అంతా ఎగ‌తాళి చేస్తుంటారు.ఈ క్రమంలో గౌతమి (లావణ్య) చూసి ప్రేమిస్తాడు. గౌతమి కూడా చంటిని ప్రేమిస్తుంది. వీరి ప్రేమ గురించి చంటి తండ్రికి తెలియడంతో చంటి జాతకం ప్రకారం అతనికి ప్రాణానికి హాని ఉందని గౌతమితో చెప్తాడు. మరి ఆ విషయం తెలిసిన గౌత‌మి ఏం చేస్తుంది? మర్డర్ కేసులో చంటి ఎలా నిందితుడు అయ్యాడు? చనిపోవడానికి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? చివరికి చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? అనేది మిగిలిన కథ.
రివ్యూ:

Ads

స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి లవ్ స్టోరీ, టెక్నాలజీ అందువటులో లేని రోజులు ఎలా ఉండేవో, మ‌నుషుల్లోని అమాయ‌క‌త్వం ఎలా ఉండేదో ద‌ర్శ‌కుడు ఈ మూవీ ద్వారా చెప్పడానికి ప్ర‌య‌త్నం చేశాడు. అంద‌మైన విజువ‌ల్స్‌, క‌ల్మ‌షం లేని క్యారెక్టర్లు, 80ల దశకాన్ని మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా చూపించాడు. ప్రేమ‌క‌థ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్ అంశాన్ని చేర్చాడు.స్నేహితులు పెళ్లి కాని ప్ర‌సాద్ అని ఎగతాళి చేసినా స‌ర‌దాగా తీసుకునే క‌ల్మ‌షం లేని హీరో, ఒక స్టేజ్ లో హ‌త్య‌లు చేయాల‌నే ఆలోచనలు చేస్తుంటాడు. అప్ప‌టిదాకా హాయిగా సాగే స్టోరీ,హ‌త్య టాపిక్ వ‌చ్చేసరికి కొత్త మ‌లుపుతో ఇంట్రెస్ట్ ను కలిగిస్తుంది.అలా స్టోరీని కొనసాగించిన డైరెక్టర్ చివ‌ర్లో మ‌రిన్ని మలుపులతో ఆడియెన్స్ కి మంచి ఫీల్ ను కలిగిస్తాడు.
చైతన్య రావు 30 వెడ్స్ 21(వెబ్ సిరీస్) పాపులారిటీ తెచ్చుకున్నాడు.అందులో లాగానే ఈ మూవీలో కూడా అలాంటి పాత్రలోనే నటించాడు.సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ నవ్వించాడు. హీరోయిన్ గా నటించిన లావణ్య లుక్స్,పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. సీరియల్ నటి ఉత్తర రెడ్డి ఈ మూవీలో హీరో చెల్లెలుగా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
దర్శకూడు చెందు ముద్దు ఫస్ట్ హాఫ్ లో తన కథనంతో ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు.అయితే సెకండ్ హాఫ్ లో తన ఫస్ట్ మూవీ ‘ఓ పిట్ట కథ’ లాగే మంచి అనుభూతిలోకి తీసుకెళ్లి, కొంత బోర్ ఫీల్ అయ్యేలా ఉంది. మూవీ అయిపోయిందని ఆడియెన్స్ అనుకునేలోపు ట్విస్ట్ లు రివీల్ చేయడం ప్రారంభించాడు. మూవీ నిర్మాణ విలువలు బాగున్నాయి. పంకజ్ తొట్టాడ అందించిన విజువల్స్ బాగున్నాయి. ప్రిన్స్ హెన్రీ అందించిన మ్యూజిక్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:

  • 1980ల బ్యాక్ డ్రాప్,
  • నటి నటులు,
  • స్టోరీలోని ట్విస్ట్ లు,
  • సినిమాటోగ్రఫీ,

మైనస్ పాయింట్లు:

  • సెకండ్ హాఫ్ లో స్లోగా సాగిన కథనం,

రేటింగ్:

2.25/5

watch trailer :

 

Previous articleకాషాయ జెండా రెపరెపలే..లక్ష్యంగా!! ఈటల సమరశంఖం
Next articleరియల్ స్టార్ శ్రీహరి గురించి సంచలన నిజాలని చెప్పిన భార్య డిస్కో శాంతి !
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.