రియల్ స్టార్ శ్రీహరి గురించి సంచలన నిజాలని చెప్పిన భార్య డిస్కో శాంతి !

Ads

విలన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టినా అంచలంచలుగా ఎదిగి హీరోగా అందరితో ఆదర్శంగా నిలిచిన నటుడు శ్రీహరి. టాలీవుడ్ కు కొత్త టైపు హీరోయిన్ పరిచయం చేయడమే కాకుండా సందేశాత్మక చిత్రాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు హీరోగా అటు సహాయ నటుడిగా బిజీగా రాణిస్తున్న టైం లో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు.

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీహరి ఎంతో మంచి మనిషి. డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్న శ్రీహరి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ప్రశాంతంగా గడుపుతూ వచ్చాయి. వీళ్ళిద్దరి పెళ్లి గురించి మరొక ఆసక్తికరమైన విషయం రీసెంట్ గా బయటపడింది. శ్రీహరి డిస్కో శాంతిని ఒక్కసారి కాదు రెండుసార్లు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ విన్న ఎవరికైనా…కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలి అని అనిపించక మానదు.

Actor Srihari భార్య పిల్లల పరిస్థితి ఇప్పుడు

డిస్కో శాంతికి మొదట తమిళ్ మరియు మలయాళం లో హీరోయిన్ గా సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికీ…కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు ప్రొడక్షన్ దగ్గరే ఆగిపోయాయి. తర్వాత కుటుంబ సమస్యల విద్య ఆమె సినిమాల్లో డాన్సర్ గా చేయక తప్పలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా వెనకాడమీ డిస్కో శాంతి తన సంపాదనతో ఆరుగురు తోబుట్టువులకు పెళ్లిళ్లు చేసింది.

Ads

Srihari Family : శ్రీహరి కుటుంబం ఇన్ని కష్టాలు పడుతుందా…? - Tolivelugu తొలివెలుగు

ఎంతో ఇష్టపడ్డ శ్రీహరి పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడు తనకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయని.. ఇప్పట్లో చేసుకోలేనని ఆమె చెప్పారట. కానీ ఎవరో ఇప్పుడు చేసుకోకపోతే ఇంక జీవితంలో పెళ్లి కాదు అని చెప్పడంతో…. ఆమెను గుడికి తీసుకువెళ్లి అక్కడ తాళి కట్టాడట. తనకు పెళ్లి కుదిరితే తాళి కానుకగా ఇస్తానని అమ్మవారికి మొక్కుకున్న డిస్కో శాంతి వెంటనే ఆ తాళి తీసి హుండీలో వేసిందట.

ఆ తర్వాత ఇద్దరూ 1996లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా శ్రీహరి, డిస్కో శాంతిని రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. ఆమె శ్రీహరిని ముద్దుగా బావ అని పిలుస్తుంది. అలా పిలవమని శ్రీహరి స్వయంగా ఆమెను కోరినట్లు డిస్కో శాంతి తెలిపారు. ఎందరికో సహాయం చేసిన శ్రీహరి చనిపోయిన తర్వాత అతనికి డబ్బులు ఇవ్వాల్సిన వారు కూడా ముఖం చాటేసారని.. దీని కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పడం ఎంతో బాధాకరంగా ఉంది.

Previous article“అన్నపూర్ణ ఫోటో స్టూడియో ” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Next articleపవన్ కళ్యాణ్ “బ్రో” సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏం అన్నారంటే..?