Ads
క్రియేటివ్ డైరెక్టర్ పేరుగాంచిన కృష్ణవంశీ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అంతః పురం. 1998 లో విడుదల అయిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ మూవీ వచ్చి ఇరవై ఐదు ఏళ్ళయింది. అయినా ఇప్పటికి తెలుగు ఆడియెన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చు.
ఆయన తెరకెక్కించిన సినిమాలలో అంతః పురం చిత్రం ఆణిముత్యం. ఈ చిత్రం ఒక్క దర్శకుడికే కాకుండా ఈ మూవీలో నటించిన అందరికి మంచి గుర్తింపును ఇచ్చింది. అంతేకాకకుండా ఈ చిత్రంలో నటించినవారికి అవార్డుల వర్షం కురిసింది. డైరెక్టర్ కృష్ణవంశీకి ఉత్తమ దర్శకుడిగా, హీరోయిన్ సౌందర్యకు బెస్ట్ యాక్ట్రస్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు హీరోయిన్ సౌందర్యకు, ఉత్తమ సహాయ నటుడిగా జగపతిబాబుకు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా మరియు ప్రత్యేక కేటగిరీలో జాతీయ అవార్డ్ లు ప్రకాష్ రాజ్ కు వచ్చాయి.
Ads
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలంగాణ శకుంతల, ఉత్తమ గాయనిగా ఎస్.జానకి, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, చివరికి హీరోయిన్ సౌందర్య క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పిన అలనాటి హీరోయిన్ సరితకు కూడా ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాష్ట్ర ప్రభత్వం ఇచ్చే నంది అవార్డులు వరించాయి. అయితే ఈ చిత్రంలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నబాబు గుర్తున్నాడా? ఈ మూవీ అంతా సౌందర్యతోనే తిరుగుతూ ఒక చిన్న బాబు కనిపిస్తాడు.
ఈ మూవీలో నటించే సమయానికి ఆ బాబుకి రెండేళ్ళు. ఈ చిత్రంలో ముఖ్యంగా సౌందర్య స్పృహలో లేక పడిపోయినపుడు కర్చీఫ్ తీసుకుని దాన్ని తడిపి తన తల్లిని తుడిచే సన్నివేశంలో ఆ చిన్న బాబు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఆ సన్నివేశం చూసిన అందరు కంటతడి పెట్టుకున్నారు. ఆ చిన్న బాబు పేరు కృష్ణ ప్రదీప్. ఈ చిత్రంలో నటించిన కృష్ణ ప్రదీప్ కి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు వచ్చింది. రెండేళ్లప్పుడు నటనతో ఆకట్టుకున్న కృష్ణ ప్రదీప్ ఆ మూవీ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు.
చదువు దెబ్బతినకూడదని భావించిన అతని పేరెంట్స్ సినిమాలకి దూరం ఉంచారు. ఆ చిత్రం వచ్చి ఇప్పటికి 25 ఏళ్ళు అంటే ఇప్పుడు కృష్ణ ప్రదీప్ వయసు 27 ఏళ్ళు. ప్రస్తుతం అతను అచ్చం మూవీ హీరోలా కనిపిస్తున్నాడు. కృష్ణ ప్రదీప్ సినిమాలలో హీరోగా నటించాలని భావిస్తున్నాడు. తనకు నటించే తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశే నా గురువు అంటున్నాడు. కృష్ట ప్రదీప్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
Also Read: ”వేణు తొట్టెంపూడి” భార్య ఎవరో మీకు తెలుసా..? ఆమె ఏం చేస్తోంది..?