”వేణు తొట్టెంపూడి” భార్య ఎవరో మీకు తెలుసా..? ఆమె ఏం చేస్తోంది..?

Ads

వేణు తొట్టెంపూడి అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు వేణు. ముఖ్యంగా వేణు అంటే మొదట గుర్తొచ్చేది తన కామెడీ టైమింగ్. కామెడీ టైమింగ్ తోనే తెలుగు ప్రేక్షకులను వేణు బాగా ఆకట్టుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ లోకి స్వయంవరం సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు వేణు.

వేణు సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని, యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. అయితే వేణు హీరోగా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా ఉంటూ…

ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలనే ఎంపిక చేసుకునే వాడు. వేణు నటించిన స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ సినిమాలు ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపించేలానే ఉంటాయి. కానీ వరుస ప్లాపులు రావడం తో సినిమాలకి దూరం అయిపోయాడు వేణు. సినిమాలకు దూరమై పదేళ్లు అవుతోంది. సినిమాల కి బ్రేక్ ఇచ్చిన తర్వాత వేణు  2012లో దమ్ము సినిమాలో నటించాడు.  అలానే మొన్నరవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ పాత్ర చేసాడు వేణు.  అయితే వేణు భార్య గురించి చాలా మందికి తెలియదు.

Ads

వేణు భార్య గురించి తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు మరి ఆమె వివరాలను ఇప్పుడు చూద్దాం. వేణు భార్య పేరు అనుపమ చౌదరి. ఈమె మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. వేణు అనుపమ ఇద్దరూ బంధువులే. ఒకరినొకరు ఇష్టపడేది మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ పెళ్ళయి పదేళ్లు దాటింది ఒక బాబు పాప కూడా ఉన్నారు. వేణు వ్యాపారాలు చేయడం వలన సమయం లేకపోవడంతో సినిమాలకి దూరమయ్యారు. తన భార్య చక్కటి సపోర్ట్ ఇస్తుంది. ఫ్యామిలీని కూడా ఆమె చూసుకుంటుంది.

Previous articleచెడు శక్తులు పోయి సమస్యలేమీ లేకుండా ఉండాలంటే… ఇలా హనుమంతుడిని పూజించండి..!
Next articleఅత్యంత ధనవంతులైన టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!