Ads
హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ డ్ర-గ్ కేసులో అరెస్ట్ కావడం ఒక పెద్ద సంచలనం సృష్టించింది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ అయిన ప్రభాకర్ రెడ్డి తో పాటు అనురాధ అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరితో పాటుగా పల్లెటూరు పుల్లట్టు టిఫిన్ సెంటర్ ఓనర్ శివ సాయి కుమార్ ను అరెస్టు చేయడం జరిగింది. డ్ర-గ్ కేసులో ఈ ముగ్గురు ప్రధాన నిందితులుగా గుర్తించిన పోలీసులు వీరికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కీలక సూత్రధారి అనురాధ అన్న విషయం బయటపడింది. అసలు ఈ అనురాధ ఎవరు…డ్ర-గ్ ఊబిలోకి ఆమె ఎలా వచ్చింది తెలియాలి అంటే ఆమె స్టోరీ ఏంటో ఫస్ట్ తెలియాల్సిందే. ఎంబీఏ చదువుకున్న అనురాధ కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ కు చెందిన వ్యక్తి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో అనురాధ పనిచేస్తుంది. లక్షల్లో జీతం చాలదన్నట్లు ఆమె సొంత ఊరి నుంచి రెండు రూపేనా నెలకు 60 వేలు ముట్టేది అదీకాక ఆమె తండ్రి పెన్షన్ మరొక 20 వేలు చేతికి వచ్చే.
Ads
నెలకి రెండు లక్షల పైగా చేతికి వచ్చి పడడంతో డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం అనురాధకు అలవాటైపోయింది. మొదట్లో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె క్రమంగా గొడవల కారణంగా విడాకులు తీసుకుంది. డైవర్స్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి వీకెండ్ పార్టీస్, పబ్స్, గోవా ట్రిప్స్ అంటూ తిరిగేది. ఈ క్రమంలో.. క్రమక్రమంగా.. డ్ర-గ్స్ అలవాటు అయ్యాయి. దాంతో డ్ర-గ్స్ కోసం తరచూ గోవాకి ట్రిప్పు వేసేది. అక్కడ డ్ర-గ్ డీలర్ అయిన పెడ్లర్ జేమ్స్ అని నైజీరియన్ వ్యక్తి వద్ద అనురాధ రెగ్యులర్ గా కొకైన్, ఎండీఎంఏ లాంటి మత్తు పదాలు కొనుగోలు చేసి హైదరాబాదుకు తెచ్చుకునేది.
తను ఒక్కటే తెచ్చుకుంటే సరిపోతుందా.. కాస్త సంఘ సేవతోపాటు…బ్యాంకు బాలన్స్ కూడా పెంచుకోవాలి అని ఆశ కలిగిన అనురాధ తాను తెచ్చిన డ్ర-గ్స్ ను గచ్చిబౌలి, కూకట్పల్లి ,బంజారాహిల్స్ మొదలైన ప్రాంతాలలో ఉన్న కష్టమర్స్ కు అన్ని సొమ్ము చేసుకునేది. ఈ నేపథ్యంలో ఆమెకు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి తో పరిచయం ప్రారంభమైంది.
ఆల్రెడీ డ్ర-గ్ అడిక్ట్ అయిన ప్రభాకర్ రెడ్డి అనురాధ దగ్గర ఈజీగా డ్ర-గ్స్ దొరకడంతో.. ఆమెతో మరింత క్లోజ్ అయ్యాడు. ఇద్దరూ డ్ర-గ్స్ తీసుకొని, హోటల్ గది తీసుకొని ఎంజాయ్ చేసే వరకు వాళ్ళ ఫ్రెండ్ షిప్ వెళ్ళింది. ఈ ఇద్దరికీ పల్లెటూరు పుల్లట్టు టిఫిన్ సెంటర్ ఓనర్ వెంకట శివ సాయి కుమార్ పరిచయమయ్యాడు. ముగ్గురు కలిసి గోవా నుంచి డ్ర-గ్స్ తెచ్చి అమ్మడం మొదలుపెట్టారు. ఇలా అనురాధ తన జీవితాన్ని తన చేతులతో తానే నాశనం చేస్తుంది. చేతినిండా డబ్బు ఉండడం ,అడగడానికి ఎవరు అడ్డు లేకపోవడం ఆమె పతనానికి ప్రధాన కారణంగా మారాయి.