Ads
నాగరికత పెరుగుతున్న కొద్దీ జనాలు హడావిడి లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయారు. ఇంట్లో అందరూ ఉద్యోగాలకు వెళ్లేవారు కావడంతో కనీసం ఇంట్లో సక్రమంగా కూరలు వండుకోవడం కూడా కష్టమైపోతుంది. పోనీ స్విగ్గి, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నామా అంటే జీతం మొత్తం వీటికి సరిపోతుంది. అందుకే హైదరాబాద్ లాంటి మహానగరాలలో చాలామంది ఇంట్లో రైస్ వండుకొని కర్రీస్ కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకోవడానికి అలవాటు పడిపోతున్నారు.
ఒక హైదరాబాద్ అనే కాదు ప్రముఖ పట్టణాలలో ఎక్కడ చూసినా మనకు ఈ కర్రీ పాయింట్ లు దర్శనమిస్తాయి. తెచ్చుకొని తినడానికి సులభంగా ఉంటుంది కానీ ఇది మన ఆరోగ్యానికి సరియైన దేనా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? టైం కలిసి వస్తుంది.. కూరగాయలు తెచ్చుకున్న అంతే ధర అవుతుంది…సులభంగా కూర తెచ్చుకుంటే పోతుంది కదా అనే ఆలోచిస్తారు తప్ప అది ఎంతవరకు శుభ్రంగా ఉంది…మన ఆరోగ్యంపై అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
Ads
నిజానికి కర్రీ పాయింట్స్ అన్నిటిలో నాసిరకం కర్రీ అమ్ముతారు అని అనడం లేదు కానీ కొన్ని కర్రి పాయింట్స్ లో మాత్రం కనీస శుభ్రత పాటించడం లేదు అనేది కచ్చితంగా చెప్పవచ్చు. పైగా కర్రీ పాయింట్స్ లో చేసే ఫ్రై ఐటమ్స్ లో ఎర్రగా కనిపించడం కోసం విపరీతంగా రంగు వాడుతారు. ఈ రంగు మన కడుపులోకి వెళ్లడం వల్ల ఎసిడిటీ దగ్గర నుంచి అల్సర్ వరకు ఎన్నో సమస్యలను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ఇంటి వద్ద శుభ్రంగా వండుకోవడం మంచిది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.