నాయక్ పాటలో “రామ్ చరణ్” తో పాటు మరొక సెలబ్రిటీ కూడా ఉన్నారు..! ఎవరో తెలుసా..?

Ads

రామ్ చరణ్ కెరీర్ లో కమర్షియల్ విజయం సాధించిన సినిమాల్లో ముందుగా ఉండే సినిమా నాయక్. పండగ కానుకగా విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. వివి వినాయక్ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ ని మరొక కొత్త కోణంలో ఈ సినిమాతో ఆవిష్కరించారు. ఈ సినిమాకి కామెడీ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమాలో ఉన్న చాలా మంది నటీనటులు, వాళ్లు మాట్లాడే డైలాగ్స్ ప్రేక్షకులకి నవ్వు తెప్పించాయి.

ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. పాటలు వినడానికి ఎంత బాగుంటాయో, చూడడానికి కూడా అంతే బాగుంటాయి. కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ తో పాటు, లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా కోసం శుభలేఖ రాసుకున్న పాటను కూడా రీమేక్ చేశారు. ఆ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒరిజినల్ పాటకి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ పాటని చిత్రీకరించారు. ఇందులో పాటలు ఇప్పటికి కూడా చాలా మంది వింటూ ఉంటారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్ లైలా ఓ లైలా.

man behind ram charan in laila o laila nayak song

Ads

ఈ పాటలో రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ అప్పట్లో చాలా ట్రెండింగ్ లో ఉండేది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ కూడా కొత్తగా ఉంటుంది. మూమెంట్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు మరొక సెలబ్రిటీ కూడా కనిపిస్తారు. ఆయన తెలియని తెలుగువారు ఉండరు. ఆ వ్యక్తి ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోయారు. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా ఇప్పుడు ఆయనని గుర్తుపడతారు. ఆయన మరెవరో కాదు. జానీ మాస్టర్. పాటలో సరిగ్గా గమనిస్తే రామ్ చరణ్ పక్కన జానీ మాస్టర్ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు.

this celebrity is making his debut as hero

ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అంతే కాకుండా, కొన్ని షాట్స్ లో రామ్ చరణ్ తో పాటు ఈ పాటలో కనిపిస్తారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పాటలకు కొరియోగ్రఫీ చేయడంతో పాటు, కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నారు. మరొక పక్క జనసేన పార్టీలో కూడా చేరారు. బాలీవుడ్ సినిమాల్లో పాటలకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దాంతో, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. తన స్టైల్ కొరియోగ్రఫీతో ఇండస్ట్రీలో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

watch video :

ALSO READ : తెలుగులో డబ్ అయ్యాక కూడా రీమేక్ అయిన 9 సినిమాలు…ట్విస్ట్ ఏంటంటే అన్ని ఫ్లాపే.!

Previous articleరాజ‌మౌళి, ర‌మ‌ పెళ్లి ఇలా జరిగిందా..? వీళ్ళ లవ్ స్టోరీ ఇదే..!
Next articleరైస్ పెట్టుకుంటే చాలు అనుకోని “కర్రీ పాయింట్స్” నుండి కర్రీ తెచ్చుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే.!