Ads
హైదరాబాద్ లోని పాతబస్తీ మజ్లిస్ పార్టీకి కంచుకోట అనే విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. కొన్ని దశాబ్దాలుగా అక్కడ మజ్లిస్ తప్ప ఏ పార్టీ పోటీ చేసిన వారికి ఓటమి అనేది ఖాయం.
పాతబస్తీలోని కార్వాన్, మలక్‌పేట,చార్మినార్, యాకత్ పూరా, చంద్రాయణగుట్ట, నాంపల్లి, బహదూర్ పురా సెగ్మంట్స్ లో మజ్లిస్ పార్టీదే గెలుపు. వారు మేనిఫెస్టో లేకుండానే ఆ పార్టీ క్యాండిడేట్స్ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో పోటీ చేసినా, పాతబస్తీ వాసులు ఆ పార్టీకే పట్టం కడుతున్నారు. అయితే అలాంటి ప్లేస్ లో ఒక హిందునేత మూడుసార్లు విజయం సాధించారు. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం..
ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న పాతబస్తీలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కాషాయ జెండాను ఎగురవేశారు. ఆ రికార్డ్ ను ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. ఆయనెవరో కాదు బద్దం బాల్ రెడ్డి. ఆయన విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో పనిచేసారు. ఆ తర్వాత బాల్ రెడ్డి జనసంఘ్‌లో చేరాడు. 1977లో జనసంఘ్ నాయకులతో పాటు జనతాపార్టీలో జాయిన్ అయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో బాల్ రెడ్డి రాష్ట్రస్థాయి లీడర్ గా ఎదిగారు.
Ads
1985-1994 వరకు వరుసగా మూడు సార్లు పాతబస్తీలోని కార్వాన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి విజయం సాధించారు. 1985 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో మజ్లిస్ క్యాండిడేట్ విరాసత్ రసూల్‌ఖాన్ మీద 9,777 ఓట్ల ఆధిక్యతతో, 1989లో 3,066 ఓట్ల ఆధిక్యతతో, 1994లో 13,293 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయనను బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ‘కర్వాన్ టైగర్’ అని పిలిచేవారు. బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుండి 1991,1998, 1999లో పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో రెండవ స్థానంలో నిలిచారు.
2019లో అనారోగ్యంతో హైదరాబాద్ కేర్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. బాల్ రెడ్డి తర్వాత పాతబస్తీ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థులు తప్ప వేరే పార్టీకి చెందిన వారు హ్యాట్రిక్ విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం ఆ ఛాన్స్ బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్ కు వచ్చింది. 2014, 2018 నుండి రాజాసింగ్ గోషామహల్ ఎమ్మల్యేగా విజయం సాధించారు. ఈ నియోజికవర్గం కూడా పాతబస్తీ పరిధిలోనిదే. ఇంకోసారి ఇక్కడ రాజాసింగ్ గెలిస్తే బాల్ రెడ్డి తర్వాత హ్యాట్రిక్ విజయం సాధించిన వ్యక్తిగా నిలుస్తారు.
Also Read: TS ELECTIONS 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈ 6 మంది అభ్యర్థుల అసలు పేర్లు ఏమిటో తెలుసా..?