Ads
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా సత్తాని దేశవ్యాప్తంగా చాటి చెప్పాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల అయ్యి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికి కూడా ఆడియెన్స్ కన్నులకు కట్టినట్లుగా ఈ మూవీలోని ప్రతి సీన్ గుర్తుండి పోయాయి. ఈ మూవీతో రాజమౌళి మరియు ప్రభాస్ ఇంటర్నేషనల్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
బాహుబలి: ది బిగినింగ్’లో ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సీన్స్ లో భల్లాలదేవుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించే సన్నివేశం ఒకటి. ఆ భారీ విగ్రహాన్ని నిలబెట్టినపుడు ఒక్కసారిగా ఎర్రని రంగులో ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని చూసిన చాలా మంది సీన్ బాగా కనపడేందుకు అలా ఎఫ్ఫెక్ట్ పెట్టారని అనుకుంటారు.
అయితే ఈ సీన్ వెనుక చాలా సైన్స్ ఉంది. అంత భారీ విగ్రహం వచ్చి డైరెక్ట్ గా గ్రౌండ్ కి తగిలినపుడు వైబ్రేట్ అయినంత ప్లేస్ లో షాక్ వేవ్ ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ ఉన్నవారందరికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అక్కడ కుంకుమని పెట్టడం జరిగింది. కుంకుమ షాక్ అబ్జర్బర్ గా పని చేస్తుంది.
Ads
అందుకే ఆ విగ్రహం డైరెక్ట్ గా గ్రౌండ్ ని తాకకుండా కుంకుమని పెట్టారు. దాంతో విగ్రహం డైరెక్ట్ గా కుంకుమను తాకుతుంది. అప్పుడు ఎక్కువగా వైబ్రేట్ అవదు. దాంతో ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా సేఫ్ అయ్యారు. రాజమౌళి మోవిలో ఎటువంటి లాజిక్ మిస్ అవ్వకుండా చాలా బాగా తెరకెక్కించారు.
Also Read: లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ను గమనించారా?