మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ‘సాగర్’ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Ads

బుల్లితెర హిస్టరీలో ‘మొగలిరేకులు’ సీరియల్ ఒక సంచలనం. సీరియల్ అనగానే మహిళలు మాత్రమే చూస్తారని అనుకుంటారు. కానీ అప్పట్లో మొగలిరేకులు సీరియల్ ను యూత్ కూడా చూసేవారు. ఈ సీరియల్‏కు యువత కూడా వీరాభిమానులు అయ్యారు.

అప్పటిదాకా టెలికాస్ట్ అయ్యే బోరింగ్ సీరియల్స్ వచ్చేవి. ఆ బోరింగ్ టీవీ సీరియల్స్ శైలిని మొగలిరేకులు మార్చేసింది. సాగదీత, అత్త కోడుళ్లు గోడవలు, ఏడుపులతో కాకుండా ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే సీన్స్ తో ప్రతిక్షణం ఇంట్రెస్టింగ్ కథనంతో మొగలిరేకులు సీరియల్ ను మంజులా నాయుడు తెరకెక్కించారు. ఈ సీరియల్ లో నటించిన నటీనటులందరికి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. ముఖ్యంగా ఈ సీరియల్ లో ఆర్కే నాయుడు మరియు మున్నాగా డ్యూయల్ రోల్ లో నటించిన సాగర్  తెలుగు వారందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు.
ఇప్పటికి కూడా ఆర్కే నాయుడుకి హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు. మున్నా, ఆర్కే నాయుడుగా నటించిన నటుడి పేరు సాగర్. కానీ సాగర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ఆర్కే నాయుడు అనగానే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పడతారు. అంతగా సాగర్ తన నటనతో ఆడియెన్స్ హృదయాలలో  స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఒకవైపు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడి పాత్రలో చాలా  హుందాగా నటిస్తూనే, మరో వైపు మున్నాగా నటించారు.
ఇక మున్నాగా ఆయన చూపించే యాటిట్యూడ్ కి అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారు. ఈ సీరియల్ తో ఒక సినిమా హీరోకు ఉన్నంత క్రేజ్ సాగర్ కి వచ్చింది. ఇక ఈ సీరియల్ కి గాను ఉత్తమ యాక్టర్ గా నంది టీవీ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇక మొగలిరేకులు తర్వాత సాగర్ మిస్టర్ ఫర్పెక్ట్ మూవీలో నటించారు. తరువాత హీరోగా రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ విజయం పొందలేకపోయారు.
అయితే సాగర్ నటనకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన తన లేటేస్ట్ ఫోటోలను ఆతన అకౌంట్ లో షేర్ చేస్తూ, తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఆయన ఫోటోలను చూసినట్లయితే అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే కనబడుతున్నారు. తన ఎనర్జీ ఏ మాత్రం తగ్గినట్టు లేదు. ఇటీవల సాగర్ జనసేనాని పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఒక  మొక్కను కూడా అందజేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాకి ముందుగా ఏ టైటిల్‌ అనుకున్నారో తెలుసా?

Ads

 

View this post on Instagram

 

A post shared by M Sagar (@sagarmofficial)

Previous articleభూమా మౌనిక రెడ్డి ఆస్తుల విలువ ఎంతనో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Next articleవామ్మో భల్లాల దేవుడి భారీ విగ్రహా ప్రతిష్ట సీన్ వెనుక ఇంత ఉందా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.