చిరంజీవి vs బాలకృష్ణ.. సంక్రాంతిబరిలో ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ హిట్స్ ఇచ్చారో తెలుసా?

Ads

సంక్రాంతి పండుగకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తుంటారు. అయితే ఈ పండగ సీజన్ లో విడుదలైన ఏ చిత్రంకు అయినా పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఆ సినీమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాదిస్తుంది.

ఇక సంక్రాంతికి ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ, భారీ స్థాయిలో ఓపెనింగ్స్ పొందుతాయి. కాగా ఈ సంక్రాంతి ఫైట్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ ఇప్పటికి తొమ్మిది సార్లు పోటీపడ్డారు. 2023 సంక్రాంతికి మరోసారి వారు పోటీ పడబోతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరో బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు ఎక్కువ హిట్స్ ఇచ్చారో చూద్దాం రండి..
1985లో చిరంజీవి, బాలకృష్ణల మధ్య తొలిసారి సంక్రాంతికి పోటీ ప్రారంభం అయ్యింది. ఆ సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ ఆత్మబలం, చిరంజీవి చట్టంతో పోరాటం అనే చిత్రాలతో వచ్చారు. ఈ రెండు చిత్రాల్లో చిరంజీవి మూవీ మాత్రమే విజయం పొందింది. ఆ తర్వాత 1987లో బాలయ్య భార్గవ రాముడు,చిరంజీవి దొంగ రాముడు చిత్రాలతో పోటీ పడగా, వీరిలో మళ్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమానే విజయం పొందింది.
1988లో బాలయ్య ఇన్స్ పెక్టర్ ప్రతాప్ మూవీతో రాగా, చిరంజీవి మంచి దొంగ అనే మూవీతో వచ్చాడు. ఇక రెండు సినిమాలలో చిరంజీవి మంచి దొంగ సినిమాతో భారీ హిట్ ను అందుకోగా,ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత 1997లో బాలకృష్ణ పెద్దన్నయ్య మూవీతో రాగా, చిరంజీవి హిట్లర్ మూవీతో వచ్చాడు. అయితే ఈ సంక్రాంతికి ఇద్దరు హీరోలు మంచి సక్సెస్ ను అందుకున్నారు.

Ads

రెండేళ్ళ తరువాత 1999లో చిరంజీవి స్నేహం కోసం మూవీ యావరేజ్ కాగా, బాలకృష్ణ సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా అయ్యింది.2000లో చిరంజీవి అన్నయ్య హిట్ కాగా, బాలకృష్ణ వంశోద్ధారకుడు యావరేజ్ గా నిలిచింది.ఇక 2001లో బాలకృష్ణ నరసింహనాయుడు బిగ్గెస్ట్ హిట్ కాగా, చిరంజీవి మృగరాజు డిజాస్టర్ గా నిలిచింది.ఆ తరువాత 2004లో బాలకృష్ణ లక్ష్మీనరసింహ హిట్ కాగా, చిరంజీవి అంజి డిజాస్టర్ అయ్యింది.చిరంజీవి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ కాగా, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ఇక రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం పొందాయి.
ఎవరికి ఎన్ని హిట్లు?
ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పండగకి 9 సార్లు పోటీ పడ్డారు. ఈ పోటీలో చిరంజీవి 4 సార్లు విజయం సాధించారు. 2 సార్లు ఇద్దరి చిత్రాలు కూడా విజయాన్ని అందుకోగా బాలకృష్ణ 3 సార్లు చిరంజీవిని డామినేట్ చేసి విజయం పొందాడు.
ఇక చాలాకాలం తర్వాత మళ్ళీ బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు సంక్రాంతి రేస్ లో నిలచాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మూవీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ 2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం పొందుతాయని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. పదవ సారి జరిగే ఈ పోటీలో ఎవరు ఎవరిపై విజయం సాధిస్తారో చూడాలి మరి.

Also Read:ఈ ఏడాది బాలీవుడ్‌లో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎంత వసూలు చేసాయంటే?

Previous articleఈ హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా వ్యాపారాలలో కూడా కోట్లు సంపాదిస్తున్నారు.
Next articleమెగాస్టార్ చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ చిత్రంలో నటించిన చిన్నారి ఎవరు? ఎలా ఉందో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.