Ads
అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అవసరం లేని పేరు. శ్రీదేవి తెలుగు సినిమల ద్వారా సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి తన అందం, నటనతో బాలీవుడ్ ను షేక్ చేసింది.
Ads
టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్స్ హీరోలందరితో జోడీ కట్టింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోబహన్ బాబు, కృష్ణం రాజు వంటి సీనియర్ హీరోల సరసన నటించింది. అంతే కాకుండా వారి తరువాత తరం హీరోల పక్కన కూడా శ్రీదేవి నటించి మెప్పించింది. అయితే నందమూరి బాలకృష్ణ, శ్రీదేవి కలయికలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. వారిద్దరి కాంబోలో మూవీ ఎందుకు రాలేదనే సందేహం అప్పట్లోనే కాకుండా, ఈ తరం ఆడియెన్స్ కి కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో కూడా నటించిన శ్రీదేవి బాలకృష్ణతో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆ కాంబోలో సినిమా ఎందుకు మిస్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ బడిపంతులు సినిమాతో శ్రీదేవి బాలనటిగా పరిచయం అయ్యింది. 1970 లో 16 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. టాలీవుడ్ లో రెండు తరాల స్టార్ హీరోలతో నటించింది. ఎన్టీఆర్ తో నటించిన శ్రీదేవి బాలకృష్ణతో నటించాలని నందమూరి ఫ్యాన్స్, ప్రేక్షకులు కోరుకునేవారంట. అయితే వీరి కలయికలో సినిమా రాలేదు. ఆ లోటు నందమూరి ఫ్యాన్స్ కి అలాగే ఉండిపోయింది.
నిర్మాత అశ్వినిదత్ శ్రీదేవి, బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక చిత్రాన్ని చేయాలని భావించారంట. చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ అనంతరం బాలకృష్ణ నటించిన చిత్రం అశ్వమేధం. ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా శ్రీదేవిని తీసుకోవాలని అనుకున్నారు. ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఈ మూవీ కోసం శ్రీదేవిని అడిగారంట. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు అవకపోవడంతో శ్రీదేవి నో అన్నారంట.
ఇక ఈ మూవీలో బాలయ్యతో పాటు శోభన్ బాబు కూడా హీరోగా నటించారు. నగ్మా, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కాగా ఆ సంవత్సరం ప్రభుత్వం చిత్రాలకు రాయితీ ప్రకటించింది. దాంతో చాలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దానివల్ల అశ్వమేధం మూవీకి హిట్ టాక్ వచ్చినప్పటికి నష్టాలు వచ్చాయి.
Also Read: నాటు నాటుకు ఆస్కార్ అవార్డు రావడానికి కారణం అతనేనా?