Ads
చాలా మంది ఆచార్య చాణక్య చెప్పినట్లుగా అనుసరిస్తూ ఉంటారు. నిజానికి ఎటువంటి సమస్యనైనా చాణక్య చెప్పిన విషయాల ద్వారా మనం పరిష్కరించుకోవడానికి అవుతుంది. చాణక్య ఎంతో గొప్ప జ్ఞాని. రచయితగా సలహాదారునిగా ఎంతో కీర్తిని సంపాదించుకున్నారు. ఆయన చెప్పిన విషయాలను ఇప్పటికి కూడా చాలా మంది ఆచరిస్తున్నారు. చిన్న సమస్య మొదలు పెద్ద సమస్య దాకా చాణక్య చెప్పిన విధంగా అనుసరిస్తే సమస్య నుండి బయటపడడానికి అవుతుంది.
ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఆచార్య చాణక్య స్నేహం గురించి, సక్సెస్ గురించి, భార్యా భర్తల గురించి ఇలా చాలా విషయాలను చెప్పారు చాణక్య.
భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి సమస్యల నుండి బయట పడాలంటే కచ్చితంగా చాణక్య చెప్పినట్లు చేయాలి. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలని… ఈ విషయాలని గుర్తు పెట్టుకోవాలని చాణక్య చెబుతున్నారు.
Ads
#1. అనుమానం:
భార్యాభర్తల మధ్య అనుమానాలు వుండకూడదు. అనుమానం కనుక కలిగితే ఆ బంధం తెగిపోతుంది కాబట్టి అనుమానాలు ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉండండి. అనుమానాలు అపార్ధాలు బంధాన్ని ముక్కలు చేస్తాయి.
#2. అబద్ధం:
ఎప్పుడు కూడా ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చెప్పకూడదు. భార్యాభర్తలు ఆనందంగా జీవితాంతం ఉండాలంటే అబద్దాలు చెప్పకూడదు.
#3. అహంకారం:
మనిషికి అహం ఉండకూడదు వైవాహిక జీవితంలో కూడా అహంకారానికి చోటు ఇవ్వకండి.
#4. గౌరవం:
భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే కచ్చితంగా వాళ్ళ బంధం బాగుంటుంది. కలకాలం కలిసి ఆనందంగా ఉండచ్చు.