Ads
చిత్రం : బెదురులంక 2012
నటీనటులు : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి గోపరాజు రమణ,గోపరాజు రమణ తదితరులు.
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం : క్లాక్స్
సంగీతం : మణి శర్మ
విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2023
స్టోరీ :
అది డిసెంబర్ 21 , 2012 . బెదురులంక అనే ఊరిలో యుగాంతం రాబోతోంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలో గ్రామంలో భూషణం (అజయ్ ఘోష్), బ్రాహ్మణుడైన బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (రాం ప్రసాద్)లతో కలిసి ఆ ఊరి ప్రజలను మరింత భయపెట్టాలని ప్లాన్ వేస్తారు.యుగాంతం రాకుండా ఆగాలంటే ఊర్లో ఉండే ప్రజలు అందరు బంగారం ఇవ్వాలని. ఆ బంగారం కరిగించి శివలింగం, శిలువ తయారు చేయించి గంగలో వదిలేయాలని చెప్తారు. ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూడా నిజంగానే యుగాంతం రాబోతోంది అని నమ్ముతాడు. ఊరంతా కూడా బయపడి నమ్మేసి అలాగే చేయాలి అనుకుంటారు.
అదే గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) హైదరాబాద్ లో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి తన ఊరికి వచ్చేస్తాడు. అతను మాత్రం ఈ విషయం నమ్మడు. ఇంతలో ఆ ఊరిలోని ప్రెసిడెంట్ గారి అమ్మాయి అయినా చిత్ర (నేహా శెట్టి) తో శివ ప్రేమలో పడతాడు. శివ వాళ్ల మోసాలని ఎలా బయటపెట్టాడు? ఊరి ప్రజలకు ఇదంతా ఎలా చెప్పాడు? ఆ తర్వాత శివ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటన్నిటిని ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
మతం పేరు చెప్పి మనిషిలోని భయాన్ని ఎలా వాడుకుంటారు అనే కాన్సెప్ట్ ని చూపించాలి అనుకున్నారు ఈ సినిమా దర్శకుడు. 2012లో యుగాంతం వస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం అయిన వార్త గురించి తెలిసిందే. ప్రపంచమంతా మునిగిపోతుంది అని అన్నారు. అదే కాన్సెప్ట్ వాడుకొని ఇందులో కొంచెం కామెడీ యాడ్ చేసి ఈ సినిమా తీశారు. ఇంటర్వెల్ కి ముందు నుండి సినిమా మరింత ఇంటరెస్టింగ్ గా మారుతుంది.
Ads
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివ పాత్రలో కార్తికేయ బాగా నటించారు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా, తన ఊరి ప్రజలని ఆ నమ్మకాల నుండి బయటకు తీసుకురావాలి అని శివ మాట్లాడే డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్ నేహా శెట్టి పాత్ర పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన పాత్రకి తగ్గట్టు నటించారు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వారందరికీ మంచి పాత్రలు దొరికాయి. వారందరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. దర్శకుడు కామెడీ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ రాయకుండా, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులనుండే కామెడీ జనరేట్ చేయడానికి ప్రయత్నించారు.
ఈ సినిమాకి కామెడీ చాలా ప్లస్ అయ్యింది. అయితే సినిమా ఒక ఫ్లోలో నడుస్తున్నప్పుడు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మాత్రం మధ్యలో ఏదో అడ్డు లాగా అనిపిస్తుంది. మణిశర్మ పాటలు కూడా అంత చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి పాజిటివ్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం అనవసరమేమో అనిపిస్తాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- కామెడీ
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్:
- హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్
- ఫస్ట్ హాఫ్ లో సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా లోపాలు అయితే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పక్కనపెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూద్దాం అని అనుకునే వారికి బెదురులంక 2012 సినిమా ఒక్కసారి చూడగలిగే కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది
watch trailer :