ఇంతకముందు 12 ఏళ్ళకి “మెచ్యూర్” అయ్యే ఆడపిల్లలు…ఇప్పుడు 8-9 ఏళ్లకే అలా ఎందుకు అవుతున్నారంటే.?

Ads

అనారోగ్య జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు శరీరంలో తెలియని మార్పులు ఎన్నో చోటు చేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వస్తున్న మార్పులను చాలామంది గమనించలేకపోతున్నారు. సహజమే కదా అని లైట్ గా తీసుకునే వారు ఉన్నారు. మీరు గమనించినట్లయితే గత కొద్ది కాలంగా ఆడపిల్లలు చాలా చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు.

ఇంతకుముందు 12 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో మెచ్యూర్ అయ్యే పిల్లలు ఇప్పుడు 9 ,10 ఏళ్లకే మెచ్యూర్ అవ్వడం గమనించవచ్చు. ఇందుకు ముఖ్యమైన కారణం విటమిన్ డి డెఫిషియన్సీ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిపోతున్న ఏసీ గదులు ,క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ప్రైవసీ కోసం 24 అవర్స్ రూమ్ లోనే ఉండడం.. వీటి కారణంగా పిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ పెరుగుతుంది.

Ads

ఇంతకుముందు కాలంలో పిల్లలు ఎక్కువగా ఆరుబయట ఆడుకునేవారు. కానీ ఇప్పుడు ఒక పది నిమిషాలు ఎండలో ఉంటే వాళ్ల చర్మం కందిపోతుందేమో అని పేరెంట్స్ తెగ బాధ పడిపోతున్నారు. కేవలం పిల్లలకే కాదు పెద్దలకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ కారణంగా భవిష్యత్తులో విపరీతమైన నొప్పులు అనుభవిస్తారు. విటమిన్ డి డెఫిషియన్సీ తలెత్తుతోంది అన్న అనుమానం కలిగిన వెంటనే రోజు పొద్దున 8 లోపు, సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో కచ్చితంగా ఒక 15 నిమిషాలు ఆరుబయట ఎండలో గడపడానికి ప్రయత్నించండి.

ఇలా చేయడం వల్ల మీ శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజసిద్ధంగా అందడమే కాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్ డి తగ్గడం వల్ల మీ శరీరంలో క్యాల్షియం అబ్జర్వేషన్ బాగా తగ్గడం వల్ల బోన్ డెన్సిటీ బలహీన పడుతుంది. ఎప్పుడైతే మీ ఎముకలు బలహీన పడతాయో.. మీ శరీరం బరువుని మోసే సమర్థతను అవి కోల్పోతాయి. దీని కారణంగా మీకు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సమస్య పెద్దది కాకముందే జాగ్రత్త పడండి.

Previous articleకార్తీకేయ,నేహా శెట్టి జంటగా నటించిన “బెదురులంక 2012” హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!!!
Next article“పుష్ప” లాగే “నెగిటివ్ టాక్”తో హిట్ ని అందుకున్న 7 సినిమాలు.!