Ads
ప్రముఖ నటుడు జోజు జార్జ్ ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ఇరట్టా. ఈ సినిమా ముందుగా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఇక థియేటర్లలో విజయం సాధించిన ఇతర భాష చిత్రాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అలా ఇటీవల కాలంలో ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేసిన మూవీ ఇరట్టా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది..
కేరళలోని వాగమన్ అనే ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్ లో చిన్న పోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖ మంత్రి హాజరవుతున్నారని పోలీసులు ఎవరి పనిలో వారు హడావిడిగా ఉంటారు. ఈ మీటింగ్ కోసం ప్రజలతో పాటుగా మీడియా కూడా కవరేజ్ కోసం కుడా ఫుల్ గా వస్తుంది. ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి మూడు సార్లు గన్ కాల్పులు వినిపిస్తాయి.
లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏఎస్సై వినోద్ చనిపోయి ఉంటాడు. అక్కడ అనుమానంగా మరో ముగ్గురు పోలీసులు ఉంటారు. దీంతో ఆ స్టేషన్ ప్రాంగణం నుంచి ఏ ఒక్కరిని బయటకు పంపకుండా అక్కడే ఉంచి విచారణ ప్రారంభిస్తారు. ఈ విషయం వినోద్ కవల సోదరుడు డీఎస్పీ ప్రమోద్ కు తెలిసి అక్కడికి చేరుకుంటారు. అసలు వినోద్ ను ఎవరు చంపారు? ప్రమోద్, వినోద్ కు మధ్య ఉన్న గొడవ ఏంటీ? వినోద్ మరణానికి కారణం ఎవరు? స్టేషన్ లో మిగతా పోలీసులతో వినోద్ కు ఎలాంటి వైరం ఉంది?
ఈ కథలో మాలినిఎవరు? వినోద్ ఎలా చనిపోయాడో తెలుసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మలయాళంలో ఇరట్టా అంటే ఇద్దరు అనే మీనింగ్ వస్తుంది. ఈ సినిమా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఒక ఈవెంట్ తో సాధారణంగా ప్రారంభమైన ఈ సినిమా ఏస్సై వినోద్ చనిపోవడంతో ఆసక్తి కలుగుతుంది.
Ads
అతను చనిపోయే స్థలంలో ముగ్గురు పోలీసులు ఉండటం. ఆ ముగ్గురితో వినోద్ కు గొడవలు ఉండటం వంటి అంశాలతో ఇన్విస్టిగేషన్ చేయడం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వినోద్ చనిపోయే సమయంలో ముగ్గురు పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు. అలాగే వారికి వినోద్ తో ఉన్న వైరం చూపిస్తూ ఒకవైపు డౌట్ క్రియేట్ చేస్తూనే మరోవైపు చిక్కుముడి విప్పుతూ ఉత్కంఠంగా మలిచారు. సాంకేతిక విభాగం పనితీరు అంతా చాలా బాగుంది. ఫైనల్ గా డిఫరెంట్ థ్రిల్లర్ ను చూద్దామనుకునేవారికి ఇరట్టా ఒక బెస్ట్ అని చెప్పవచ్చు .
ఇక సినిమాలో క్రైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మొదటి సినిమా అయినా రైటర్ గా, డైరెక్టర్ గా రోహిత్ ఎంజీ కృష్ణన్ అదరగొట్టారు. రెగ్యులర్ గా న్యూస్ లో చూసే ఓ అంశాన్ని ఇంత బాగా తీయొచ్చా అని ఆశ్చర్యపరిచారు. ఇక ద్విపాత్రాభినయం చేసిన జోర్జ్ జాజ్ నటనతో చింపేశాడు. ఇక జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాములుగా లేదు. ప్రతి సీన్ లో ఆ మూడ్ ఎలివేట్ అయ్యేలా ప్రాణం పోశాడు. అంజలి పాత్ర అంతగా ప్రభావం ఉండదు. మిగతా క్యారెక్టర్స్ బాగానే చేశారు. అక్కడక్కడ కాస్త బోరింగ్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
ALSO READ : ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పాపులర్ యాక్టర్ అయ్యారు..! ఎవరో గుర్తు పట్టారా..?