ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పాపులర్ యాక్టర్ అయ్యారు..! ఎవరో గుర్తు పట్టారా..?

Ads

ఎంతో మంది సినీ నటులు సినిమాల నుండి కాకుండా ఇతర మాధ్యమాల నుండి కూడా తమ కెరీర్ మొదలు పెడతారు. కొంత మంది సోషల్ మీడియాలో రీల్స్ లాంటివి చేస్తారు. కొంత మంది యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసి రిలీజ్ చేస్తారు.

ఇంకా కొంత మంది అయితే సీరియల్స్ ద్వారా కూడా సినిమాల్లోకి అడుగు పెడతారు. అలా సీరియల్స్ ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టి, ప్రస్తుతం భారతదేశం మొత్తం గుర్తింపు సంపాదించుకున్న నటుడి పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Did you recognize this actor

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంతో మంది అభిమానులని, అలాగే ఎన్నో అవార్డులని కూడా సంపాదించుకున్నారు. ఈ వ్యక్తి తమిళ్ వ్యక్తి అయినా కూడా తెలుగులో కూడా చాలా గుర్తింపు పొందారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేశారు. ఇదంతా చదివాక ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది.

Did you recognize this actor

Ads

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు. ప్రముఖ, నటుడు దర్శకుడు సముద్రఖని. తమిళ్ లో సీరియల్స్ లో నటించడంతో పాటు, సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించారు. అందులో కొన్ని సీరియల్స్ తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, సార్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.

Did you recognize this actor

అలాగే ఇటీవల వచ్చిన బ్రో సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఎన్ని పాత్రలు చేసినా కూడా తెలుగు వాళ్ళకి సముద్రఖని అంటే మొదటిగా గుర్తుకు వచ్చేది రఘువరన్ బీటెక్ లో ధనుష్ తండ్రి పాత్ర. ఈ పాత్రతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయకుండానే సముద్రఖని చాలా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సముద్రఖని కానీ వరుస తమిళ్ తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా వినోదయ సిత్తం సినిమాని తెలుగులో బ్రో పేరుతో రూపొందించాక మిగిలిన భాషల్లో కూడా రూపొందించాలి అని అనుకుంటున్నారు అని చెప్పారు.

Previous articleఅత్త ఎప్పటికీ తల్లి కాలేరా..? ఈ ప్రశ్నకి ఒక మహిళ ఏం సమాధానం చెప్పారంటే..?
Next articleడల్లాస్ లో వీ ఎన్ ఆదిత్య రూపకల్పనలో కొత్త సినిమా ఆడిషన్స్ కి విశేష స్పందన
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.