Ads
సినిమా థియేటర్లో మెగాస్టార్ మూవీ అంటే ఒకప్పుడు జాతర లాగా ఉండేది. కాస్త రూట్ మార్చి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెగాస్టార్ తిరిగి వాల్తేరు వీరయ్య అని అందరికీ పాత బాస్ మాస్ టచ్ పరిచయం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా బోలాశంకర్ చిత్రంలో చిరు పర్ఫామెన్స్ కి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. నిన్న విడుదలైన రజినీకాంత్ జైలర్ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కరోజు గ్యాప్ తో వస్తున్న ‘భోళా శంకర్’ పై ఎక్కడ దీని ప్రభావం పడుతుందో అనుకున్న సినీవర్గం చిరంజీవి బొమ్మ పడ్డాక…”బాస్ ఇస్ బ్యాక్”అని సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం…
సినిమా: భోళా శంకర్
నటీనటులు : చిరంజీవి, తమ్మనా,కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు.
దర్శకుడు: మెహర్ రమేష్
సంగీతం : మహతి స్వర సాగర్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
విడుదల తేదీ: ఆగస్ట్ 11,2024
కథ:
కలకత్తాలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న ‘భోళా శంకర్’ మరియు అతని చెల్లెలు కీర్తి సురేష్ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. చెల్లెల్ని బాగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని తహతహలాడే అన్నయ్య శంకర్. ఇతనికి కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువనే చెప్పొచ్చు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే అస్సలు భరించలేరు మరీ ముఖ్యంగా ఆడపిల్లకు ఏదైనా ఆపద వచ్చింది అంటే అక్కడ కచ్చితంగా శంకర్ టాక్సీ ఉంటుంది అని కలకత్తా మొత్తం ఫేమస్.
కలకత్తాలో పెరిగిపోతున్న మహిళా మిస్సింగ్ కేసులను ఛేదించడంలో శంకర్ పోలీసులకు తన వంతు సాయం అందిస్తాడు. ఈ నేపథ్యంలో ఆ ముఠా కారణంగా శంకర్ చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. అసలు ఈ అన్నా చెల్లెళ్ల స్టోరీకి కిడ్నాపింగ్ కథ లింక్ ఎలా వచ్చింది? అసలు శంకర్ ఎవరు అతని గతం ఏమిటి? తెలుసుకోవాలంటే మాత్రం తెరపై బొమ్మ చూడాల్సిందే.
Ads
రివ్యూ:
మొదట్లో చిరంజీవి మూవీ డైరెక్షన్ మెహర్ రమేష్ చేస్తున్నాడు అంటే అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ సినిమా కూడా ఒక పెద్ద డిజాస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు ఇది తమిళ్ వేదాళం మూవీ రీమేక్ కావడంతో ఇందులో కొత్త ఏముంటుంది అన్నవారు లేకపోలేదు. అయితే నిజంగా సినిమా చూసిన వారికి వేదాళం చిత్రానికి దీనికి ఎంతో తేడా ఉందని తెలుస్తుంది.
ఈ చిత్రం మెహర్ రమేష్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలబడ పోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు.
చిత్రానికి సంబంధించిన మెయిన్ బేస్ ని డిస్టర్బ్ చేయకుండా ఫాన్స్ చిరు నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని అద్భుతంగా చూపించారు. బ్యాక్ టు బ్యాక్ కామెడీ దగ్గర నుంచి చిరు మార్క్ డైలాగ్స్ వరకు.. ఆధ్యాంతం ఫ్యాన్స్ కి పండగే. ఇంతకుముందు కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిరంజీవి చూడాలని ఉంది చిత్రం ఎటువంటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. తిరిగి అదే కలకత్తా బ్యాక్ డ్రాప్ కావడంతో అభిమానులు ఈ చిత్రంపై రెట్టింపు అంచనాలను పెట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
ఈ మూవీలో మెగాస్టార్ కామెడీ యాంగిల్ అభిమానులకు కడుపు నింపుతుంది.
లాస్ట్ 90 మినిట్స్ మూవీ అయితే వేరే లెవెల్ లో ఉంది.
ఇక చిరుతో కలిసి తమన్నా వేసే స్టెప్స్ కి మొత్తం థియేటర్ షేక్ అవుతుంది.
చిరంజీవి , కీర్తి సురేష్ మధ్య బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సీన్ అద్భుతంగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ చేస్తూ చేసిన ఖుషి సీన్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.
మైనస్ పాయింట్స్:
సాంగ్స్ ఆవరేజ్ గా ఉన్నాయి.
అక్కడక్కడ రొటీన్ కథ అని అనిపిస్తుంది.
మధ్యలో స్టోరీ బాగా స్లో అనిపిస్తుంది.
రేటింగ్: 3/5