బాలయ్య చిరకాల స్వప్నం చెంఘీజ్ ఖాన్ బయోపిక్.. ఇంతకి అతను ఎవరో తెలుసా?

Ads

తెలుగు సినీ పరిశ్రమ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన నటించిన వీరసింహరెడ్డి సినిమా తాజాగా విడుదల అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా,శృతి హాసన్, హాని రోజ్ హీరోయిన్స్ గా నటించారు.

మైత్రీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల జరిగిన వీరసింహరెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ చెంఘీజ్ ఖాన్ పై సినిమా తీయాలని ఉందని, ఇది తన చిరకాల స్వప్నం అని తెలిపారు. ఇక అప్పటి నుండి నెటిజెన్స్ అసలు ఈ చెంఘీజ్ ఖాన్ ఎవరని ఆరా తీస్తున్నారు. ఆ చెంఘీజ్ ఖాన్ గురించి తెలుసుకోవడానికి తెగ వెతుకుతున్నారు.
అయితే ఆయన మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఇక చెంఘీజ్ ఖాన్ పునాది వేసిన మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరు తెచ్చుకుంది. చెంఘీజ్ అసలు పేరు టెమూజిన్. ఈయన ఒక సంచార జాతికి సంబంధించినవారు. ఇక మంగోల్ సామ్రాజ్య స్థాపన అనంతరం చెంఘీజ్ ఖాన్ తన దండయాత్ర మొదలు పెట్టారు. ఆయన సైన్యంతో వేరే ప్రాంతాలపైన దండయాత్ర చేసేవారు. ఇక ఆయన ప్రజల విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించేవాడని సమాచారం. చారిత్రక రచనల ఆధారంగా చెంఘీజ్ ఖాన్ స్త్రీల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. చెంఘీజ్ ఖాన్ సైన్యం చేష్టలను భరించలేక చాలా మంది రాజ్యాధినేతలు కూడా ఆయనకు సామంతులు అయ్యారంట. అయితే ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కితే పాన్ వరల్డ్ మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Ads

నెగిటివ్ షేడ్స్ ఉన్న చెంఘీజ్ ఖాన్ లాంటి పాత్ర బాలకృష్ణకు సెట్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి కథను క్రిష్, సంకల్ప్ లాంటి దర్శకులు కూడా హ్యాండిల్ చేయగలరు. మరి ఈ సినిమా కోసం ఏ దర్శకుడు బాలయ్యను చెంఘీజ్ ఖాన్ కథతో కలుస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

Also Read: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ.. బాలయ్య ఫ్యాన్స్ కు పండగ 

Previous articleక్రికెట్ లో రెడ్ కార్డుని ఎందుకు ఇస్తారు..? ఏ ఆటగాడికి ఇచ్చారో మీకు తెలుసా..? (Video)
Next articleమాస్ బీభత్సాన్ని సృష్టిస్తున్న భోళా శంకర్. .. ఇరగదీస్తున్న మెగాస్టార్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.