బిగ్ బాస్ సీజన్ 6 విజేత రేవంత్! కానీ అక్కడే ట్విస్ట్.. అది ఏమిటో తెలుసా?

Ads

బుల్లితెరపై చాలా షోలు వస్తున్నా, వాటిలో ప్రేక్షకుల అభిమానాన్ని కొన్ని షోలు మాత్రమే గెలుచుకుంటాయి. అలా బుల్లితెర ప్రేక్షకుల మనసులను దోచుకున్న షో బిగ్ బాస్. ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఆదివారం రోజున ఆరో సీజన్ కు వీడ్కోలు చెప్పింది.

Ads

ఇక బిగ్ బాస్ 6 సీజన్ కు మెుదట్లో నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. బిగ్ బాస్ 6 ఫినాలేలో విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. రన్నర్ గా శ్రీహాన్ గా ప్రకటించాడు. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. ఇక ఈ ట్విస్ట్ ను ఎవరూ కూడా ఊహించి ఉండరు. అయితే బిగ్ బాస్ 6 విజేతగా ట్రోఫీని అందుకున్న సింగర్ రేవంత్ కు పది లక్షలు వస్తే, రన్నరప్ గా ఉన్న శ్రీహాన్ కు నలబై లక్షలు వచ్చాయి. అయితే అదేంటి రన్నరప్ కు ఎక్కువ ఇవ్వడం అనుకుంటున్నారా? అయితే అది ఎలానో చూద్దాం..
ఇక 6వ సీజన్ లో 21 మంది పోటీదారులు పోటీపడ్డారు. కాగా టాప్ 5కి సింగర్ రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్, కీర్తి భట్ లు వెళ్లారు. తాజాగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్ గెలిచాడు. శ్రీహాన్ రన్నరప్ గా నిలిచాడు. ఫినాలేలో ఫస్ట్ రోహిత్, ఆ తర్వాత ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత మూడో వ్యక్తిగా కీర్తి భట్ ఎలిమినేట్ అయ్యింది. తరువాత కింగ్ నాగార్జున బంగారు సూట్ కేస్ తో హౌజ్ లోకి వెళ్లారు.
అప్పుడు హౌజ్ లో ఉన్న రేవంత్ కు, శ్రీహాన్ కు సూపర్ ఆఫర్ చెప్పారు. ప్రైజ్ మనీగా వచ్చేదానిలో నుండి సగం తీసుకుని వెళ్లిపోవచ్చని చెప్పాడు. అయితే ఆ ఆఫర్ కు ఇద్దరు అంగీకరించలేదు. దాంతో నాగార్జున ప్రైజ్ మనీని ముప్పై లక్షలకు చేసారు. దానికి ఇద్దరు ఒప్పుకోలేదు. ఫైనల్ గా నాలబై లక్షలకు పెంచగా, శ్రీహాన్ తీసుకున్నాడు. ఇంకేముంది రేవంత్ బిగ్ బాస్ 6 విన్నర్ గా నిలిచాడు. విన్నర్ రేవంత్ కు బిగ్ బాస్ 6 ట్రోఫీతో పాటుగా, మిగిలిన ప్రైజ్ మనీ పదిలక్షలు గెలుచుకున్నాడు. కాగా రన్నర్ అయిన శ్రీహాన్ నలబై లక్షలు గెలుచుకోవడం ఇక్కడి విశేషం.

Also Read: ఉదయ్ కిరణ్ ఈ 10 సినిమాలు చేసి ఉంటే నిలదొక్కుకునేవాడు!

Previous articleపోసాని వాడే ఉతపదం ‘లవ్ యు రాజా’ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
Next articleఆ హీరోయిన్‌ కోసమే ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.