ఆ హీరోయిన్‌ కోసమే ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారా?

Ads

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 2 ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం అయినా కూడా కిక్‌ రావడం లేదని అంటున్నారు. ఇక ఈ మాట అనేది మరెవరో కాదు ‘అన్‌స్టాపబుల్‌ ఫ్యాన్స్‌ నెట్టింట్లో అంటున్న మాట. కానీ ఇదంతా బాహుబలి విత్‌ బాలయ్య ప్రోమో రిలీజ్ కానంత వరకే.

Ads

ఇక బాహుబలి విత్‌ బాలయ్య అని ప్రభాస్ ప్రోమో వచ్చి రాగానే, హైప్‌ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. కోటి వ్యూస్‌ ను కూడా దాటింది. ఎందుకంట ఈ ప్రోమోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి మరి. వాటిలో ఒక విషయం ఏంటి అంటే ఒక హీరోయిన్‌ గురించి ప్రభాస్‌, గోపీచంద్‌ గతంలో గొడవపడ్డారని తెలిసింది. ఇక ఆ హీరోయిన్‌ ఎవరని వారిద్దరి సినిమాలు చూసినపుడు క్లారిటీ వచ్చింది.ఆ హీరోయిన్‌ ఏమిరో చూద్దాం..తెలుగు సినీపరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌ అని చూసినపుడు, ఆ లిస్ట్ లో ఖచ్చితంగా ప్రభాస్, గోపిచంద్ ఉంటారు. వీరు ‘వర్షం’ మూవీతో కలిసారు. ఇక అప్పటినుండి వీరి స్నేహం అలాగే కొనసాగిస్తున్నారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఒక హీరోయిన్ వల్ల గొడవ జరిగిందంటే, అది ఏమిటో తెలియాలని, ఇక ఆమె ఎవరో బయటకు రావాలని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.కాగా ప్రభాస్, గోపిచంద్ మధ్య జరిగిన గొడవ సీరియస్‌ అయితే కాదని, సరదాకి జరిగింది అని తెలుస్తోంది. కానీ ఆ హీరోయిన్‌ ఎవరు ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది. ఆ హీరోయిన్‌ అనుష్క అని కొందరు అంటున్నారు.అయితే ప్రభాస్‌తో త్రిష 2008లో ‘బుజ్జిగాడు’ అనే మూవీ చేసింది. ఇక అదే టైమ్ లోనే గోపిచంద్‌తో కలిసి ‘శంఖం’ అనే మూవీలో నటించింది. వీరు ముగ్గురూ అప్పటికే ‘వర్షం’ మూవిలో కలసి నటించారు. వర్షం మూవీలో విలన్‌గా చేసిన గోపీచంద్‌ హీరోయిన్ త్రిష గురించి హీరోగా నటించిన ప్రభాస్‌తో గొడవ పెట్టుకుంటాడు. ఇక 2008లో బుజ్జిగాడు,శంఖం చిత్రాలు ఒకే సారి షూటింగ్ చేయడంతో త్రిష రెండు సెట్స్‌కు అటు ఇటు తిరుగుతూ చేసింది.
ఇక అప్పుడే ఒకసారి హీరోయిన్‌ త్రిష కోసం ప్రభాస్‌, గోపీచంద్ సరదాగా గొడవ పడ్డారంట. బాలయ్య టాక్‌ షోలో దాని గురించే ఇద్దరు మాట్లాడారు అని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరికి వారు అనుకుంటున్నారు. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? గొడవ ఏంటి అనేది తెలియాలంటే బాహుబలి ఎపిసోడ్‌ స్ట్రీమ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

Also Read: రిషబ్ శెట్టిలా ఈ 10 మంది హీరోలు కూడా దర్శలుకుగా సినిమాలు చేశారు..

Previous articleబిగ్ బాస్ సీజన్ 6 విజేత రేవంత్! కానీ అక్కడే ట్విస్ట్.. అది ఏమిటో తెలుసా?
Next articleఈ ఏడాది బాలీవుడ్‌లో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎంత వసూలు చేసాయంటే?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.