Ads
తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఇప్పటికే 8 వారాలు పూర్తయ్యాయి. ఎనిమిదవ వారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
‘ఉల్టా పుల్టా’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రారంభం అయిన ఏడవ సీజన్ లో, తాజాగా కొత్త కెప్టెన్ గౌతమ్ మంచి డిసిషన్ తీసుకుని, ఈ షోను ఫాలో అవుతున్న మహిళా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్‌బాస్ షోలో మామూలు రోజుల కన్నా నామినేషన్స్ ఉన్న రోజు హడావుడి వేరే లెవెల్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కంటెస్టెంట్స్ మధ్య హీటెక్కించే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. వీటికన్నా ముందు గౌతమ్ కృష్ణ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అలాగే డిప్యూటీలుగా శోభ, రతికని సెలెక్ట్ చేసుకున్నాడు.
గౌతమ్ మాట్లాడుతూ, ‘ప్రతి ఇంట్లో మహిళలు చాలా రకాల పనులు చేస్తుంటారని, ఇంటి బాధ్యతల విషయంలో వారిదే పైచేయి. ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు, ఇక్కడున్న మరియు టీవీ చూస్తున్న మహిళలకు గౌరవంగా బిగ్‌బాస్ హౌజ్ లో ఈ వీక్ ని ఫీమేక్ వీక్ (మహిళల వారం) గా జరుపుకుందాం. ఇందులో భాగంగా ఈ వారం అంతా లేడి కంటెంస్టెంట్స్ కు సెలవు ఇస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇది గేమ్ ప్లానులో భాగం కూడా కావచ్చు. ఎలా తీసుకున్నా, బిగ్‌బాస్ హౌజ్ లో ఇలాంటి నిర్ణయం మొదటిసారి అని తెలుస్తోంది.
ఇదే కాకుండా కెప్టెన్ గౌతమ్ మరో నిర్ణయం కూడా తీసుకున్నాడు. రోజు లైట్స్ ఆఫ్ అయిన తరువాత ఆ రోజు అందరూ చేసిన పని గురించి నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు. హౌజ్ లో బాగా కష్టపడినవారికి కష్ట జీవి అని, అందరి కంటే తక్కువ పనిచేసినవారికి పనిదొంగ అనే బిరుదులు ఇస్తామని అన్నాడు. కష్ట జీవి బిరుదు అందుకున్నవారికి ఒక డ్రింక్ ఇస్తానని, పనిదొంగ అని బిరుదు వచ్చినవారు వారి 2 ఎగ్స్ ని తిరిగిచ్చేయాలని కెప్టెన్ వెల్లడించాడు.
Ads
Also Read: “సితార” ధరించిన ఈ లెహంగా కాస్ట్ ఎంతో తెలుసా..? సూపర్ స్టార్ కూతురు అంటే ఆ మాత్రం ఉండాలిలే..!