Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుగులోనే కాకుండా కన్నడలో మంచి క్రేజ్ ఉంది. అయితే పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మూవీలో నటన, మేనరిజమ్స్ తో పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు అందుకుని సత్తా చాటాడు.
అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఏకైక హీరోగా చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి హీరోని ఒక నటి అవమానించిందంటూ ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్నారు. అలాంటి ఒక స్టార్ హీరో హైట్ పై ఒక నటి అవమాన పరిచేలా కామెంట్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అశ్విని శ్రీ. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మికకి అక్క క్యారెక్టర్ చేసింది. ఆమె కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అవి హిట్ అవకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సైడ్ పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో కొనసాగుతుంది.
అశ్విని బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇంటర్య్వూలో స్టార్ హీరోల పక్కన ఐటెం సాంగ్స్ చేయాలని ఉందని, తన హైట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని అన్నారు. అల్లు అర్జున్ చేయాలంటే తన పక్కన స్టాండ్ వేసుకొవాల్సి వస్తుంది అని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో బన్నీ ఫ్యాన్స్ అశ్విని శ్రీని ట్రోల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ని అనేంత ధైర్యమా అంటూ బన్నీ అభిమానులు తిట్టిపోస్తున్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు విజేత అనే గౌరవం కూడా లేకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఆమె సరదాగా మాట్లాడినా సరే అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అశ్విని శ్రీ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Ads
Also Read: లియో OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?