Ads
బీజేపీ సీనియర్ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఒక బెదిరింపు కారణంగా ఓటమిపాలయ్యాడు. నిండు ప్రాణం పోతుంది అని భయపడ్డారో లేక జాలిపడ్డారో తెలియదు కానీ.. మొత్తానికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్క మొగ్గు చూపారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. ఎన్నికల ప్రచారానికి అన్ని ప్రయత్నాలు ఆఖరికి తన కూతురు చేత కూడా ప్రచారం చేయించిన కౌశిక్ రెడ్డి గెలవకపోతే చనిపోతానని ఓటర్లని బెదిరించాడు.
మీరు నన్ను గెలిపిస్తే జైత్ర యాత్ర తో మీ ముందుకు వస్తాను. కాదు అని ఓడిస్తే నా శవ యాత్రను మీరు చూస్తారు అంటూ ఎమోషనల్ గా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ విషయంపై అప్పట్లో చాలామంది అతన్ని విమర్శించడమే కాకుండా మిమ్స్ తో సోషల్ మీడియాలో కూడా హడావిడి చేశారు. స్థానికంగా ఈటెలకు మంచి పేరు ఉన్నప్పటికీ.. ఆయన కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Ads
అనవసరంగా ఒక నిండు ప్రాణాలు పోవడం ఎందుకు అని ఆలోచించి కొందరు.. జాలిపడి కొందరు.. ఇలా మొత్తానికి కౌశిక్ రెడ్డి సానుభూతితో ఓట్లు గెలిచాడు అని అందరూ భావిస్తూన్నారు.స్థానికంగా ఈటెల ఓటమికి కారణం ఇదే అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. మామూలుగా ఓటర్లను బతిమిలాడి ..పథకాల ఎర్ర చూపించి గెలిచే నాయకుల్ని చూసి ఉంటాము కానీ ఇలా ఓటు వేయకపోతే చనిపోతాను అని బెదిరించి మరీ గెలిచిన వ్యక్తి ని చూడడం ఇదే మొదటి సారి ఏమో.
ALSO READ : తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ముఖ్యపాత్ర వహించిన ఈ వ్యక్తి ఎవరు..? ఇతని వ్యూహాల వల్లే కాంగ్రెస్ గెలిచిందా..?