Ads
హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ గురించి చెప్పక్కర్లేదు. అందరికీ సుపరిచితమే. బ్రూస్ లీ పేరు చెప్పగానే మనకి మొదట మార్షల్ ఆర్ట్స్ ఏ గుర్తు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్ లెజండ్ బ్రూస్ లీ. వరల్డ్ వైడ్ గా పేరు సంపాదించారు. అది కూడా చాలా తక్కువ కాలంలోనే. కానీ అలా సడెన్ గా బ్రూస్ లీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన వయస్సు కేవలం 32 ఏళ్ళే.
నవంబర్ 27, 1940 జన్మించి జులై 20, 1973 వరకు బ్రూస్ లీ గురించి తెలుసు. అమెరికాలో జన్మించి హాంకాంగ్ లో బ్రూస్లీ పెరిగారు. బ్రూస్ లీ అసలు పేరు బ్రూస్ లీ కాదు. ‘లీ జున్ ఫాన్’.
మొదటి సారి ఈయన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో 1964లో ఫేమస్ అయిపోయారు. అందర్నీ ఒక్క సారే అవాక్ అయ్యేలా చేసేసారు. ఇంచ్ దూరం పంచ్‌ని ప్రయోగించి షాక్ అయ్యేలా చేసారు.
Ads
ఆయన ఆబ్జెక్ట్ కి ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి బలమైన పంచ్‌ని విసిరారు. అది చూసి అంతా అది ఎలా అయ్యిందా అని షాక్ అయ్యిపోయారు. థామ్ చీ చువాన్ అని ఒక విద్య ని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నారు. అది కూడా బ్రూస్ లీ తన చిన్నతనంలోనే నేర్చుకున్నారు. అలానే ఈయన కుంఫు లో భాగమైన వింగ్ చున్ లో శిక్షణ ని ఇప్‌మెన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది.
వన్ ఇంచ్ పంచ్‌తోనే కాస్త మందంగా ఉండే చెక్కను ముక్కలుగా చేసేసే వారు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఇప్పుడైతే భాగం అయ్యిపోయింది. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ ఆయన 18 ఏళ్ల వయస్సులోనే నేర్చేసుకున్నారు.
అంతే కాదు ఈయన 18 సంవత్సరాల నాటికే 12 సినిమాల్లో చేసారు. బాడీ ఫిట్నెస్ కోసం బ్రూస్ లీ కఠిన వ్యాయామాలు కూడా చేసేవారు. 1965 లో యాక్యున్గ్ జిమ్ లో బ్రూస్ లీ వ్యాయామాలు చేసింది. ఆ లిస్ట్ వైరల్ అవుతోంది.
అయితే లిస్ట్ లో రివర్స్ కర్ల్, రిస్ట్ కర్ల్, సిటప్స్, స్క్వాట్స్, ఫ్రెంచ్ ప్రెస్, పుషప్స్, ట్రైసెప్ స్ట్రెచ్, డంబెల్ సర్కిల్ ఇలాంటివి అన్నీ కూడా వున్నాయి. అయితే ఈ లిస్ట్ ని చూసి నెటిజన్లు వారికి నచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. కఠిన శ్రమ చేసారు కాబట్టే ఆయన అంత గొప్పవాడయ్యాడు అంటూ కామెంట్స్ చేసారు.