Ads
గతంలో తెలుగువారు అంటే చాలా మందికి ఒక చిన్న చూపు ఉండేది. అలాంటిది చాలా మంది తెలుగు వాళ్ళు దేశం అంతా మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని చాటి చెప్పి తెలుగు రాష్ట్రాలు గర్వపడేలాగా చేశారు. వారిలో సినిమా ఇండస్ట్రీకి చెందినవారు, క్రీడా రంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు, వ్యాపార రంగానికి చెందినవారు ఇలా వివిధ రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వాళ్లంతా కూడా తమ తమ రంగాల్లో చాలా బాగా కష్టపడి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా, తెలుగు వాళ్ళ సత్తా ఎలా ఉంటుందో నిరూపించారు.
తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఏమీ తక్కువ కాదు అనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. పైన ఉన్న వ్యక్తి అలాగే తెలుగు వారి ప్రతిభని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే లాగా చేశారు. ఈ వ్యక్తి ఎంత ఫేమస్ అయ్యారు అంటే, ఆయన మా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని దేశం అంతా కూడా అనుకునేలాగా ప్రతి ఒక్కరికి చేరువయ్యారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. మనిషి మన మధ్యలో లేరు. పాటల రూపంలో మన మధ్యలోనే ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మరణం చాలా మందికి జీర్ణించుకోలేని ఒక విషయం. ఆయన మన మధ్య లేరు అనే విషయం ఇప్పటికి కూడా చాలా మందిని బాధపెడుతుంది.
Ads
పైన ఫోటో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తీసిన ఫోటో. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చనిపోయినప్పుడు తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా, తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు, హిందీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ప్రతి ఇండస్ట్రీ వారు కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం తమ రాష్ట్రానికి చెందినవారు అని అనుకున్నారు. ఒక వ్యక్తికి ఇంత ఆదరణ లభించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి విషయంలో ఇదే జరిగింది. ఇప్పటికి కూడా ఆయన పాట లేనిదే రోజు గడవని వారు చాలా మంది ఉన్నారు. ఎన్నో సింగింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఆయన పాటలు ఇప్పటికి కూడా వింటూనే ఉంటారు. ఎన్నో గొప్ప పాటలు పాడారు, అంతే కాకుండా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి కాబట్టే ఆయనకి అంత మంది అభిమానులు ఉన్నారు.