అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్న ఈ వైసీపీ అభ్యర్థి ఎవరు..? అల్లు అర్జున్ కి ఏమవుతారంటే..?

Ads

పుష్ప సినిమా ద్వారా భారతదేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ వాళ్లకి కూడా ఫేవరెట్ హీరో అయిపోయారు. అల్లు అర్జున్ పేరు అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నో ఇంటర్వ్యూలలో బాలీవుడ్ నటులు కూడా తమ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని, అల్లు అర్జున్ తో నటించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పారు. మలయాళం ఇండస్ట్రీలో అయితే అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.

ycp candidate supported by allu arjun

అందుకే అల్లు అర్జున్ నటించిన సినిమాలు మలయాళ భాషల్లో తప్పకుండా విడుదల అయ్యేవి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండవ భాగం షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పుష్ప పుష్ప అనే పాట బయటికి వచ్చింది. ఈ పాటలో అల్లు అర్జున్ వేసే స్టెప్స్ ట్రెండింగ్ గా మారాయి. స్టెప్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. పాటలో అల్లు అర్జున్ గెటప్ చూస్తూ ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్ర అభివృద్ధి చెంది ఇంకా ఫేమస్ అయినట్టు అర్థం అవుతోంది.

Ads

మొదటి భాగంలో నటీనటులతో పాటు, ఇందులో ఇంకా కొంత మంది కొత్త వారు కూడా నటించబోతున్నారు. అయితే, అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో కనిపించారు. సాధారణంగా అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే, ముందుగా ఎక్కడైనా ప్రకటనైనా వచ్చేది. కానీ ఇవాళ సడన్ గా నంద్యాలలో అల్లు అర్జున్ కనిపించారు. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలకడానికి నంద్యాలకి వెళ్లారు. అల్లు అర్జున్ తో పాటు, ఆయన భార్య స్నేహ రెడ్డి కూడా నంద్యాలకి వెళ్లారు.

దాంతో అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో సందడి చేశారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు స్నేహ రెడ్డికి చాలా మంచి మిత్రులు. ఈ కారణంగానే అల్లు అర్జున్ స్నేహపూర్వకంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళ్లారు. అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లడంతో, అల్లు అర్జున్ ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నంద్యాలలోని రోడ్లు అంతటా కూడా ఎంతో మంది జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లి శుభాకాంక్షలు తెలిపినందుకు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి ధన్యవాదాలు తెలిపారు.

Previous articleఈ ఫోటోలో ఉన్న తెలుగు వ్యక్తి దేశం అంతా గర్వపడేలా చేశారు..! ఎవరో కనిపెట్టగలరా..?
Next article5 కోట్లు పెట్టి తీసిన సినిమా… 78 కోట్లు వసూలు చేసింది..! ఈ సినిమా చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.